- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా స్త్రీలు పోరాడాలి’
దిశ ప్రతినిధి, ఖమ్మం: మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తేనే, సమాజం అభివృద్ధి చెందుతుందని ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి అన్నారు. సోమవారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య( డీవైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా యంగ్ ఉమేన్ 2వ మహసభలో ఆమె పాల్గొన్నారు. స్థానిక సుందరయ్య భవన్‌లో డీఐఎఫ్ఐ యంగ్ ఉమెన్ రెండో మహాసభ పదముత్తుం ఉష అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాచర్ల భారతి మాట్లాడుతూ… మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని, ఎన్నో ఏండ్లుగా వస్తున్న మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలని, స్త్రీల పాత్ర సమాజ అభివృద్ధిలో కీలకమని అన్నారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ మాట్లాడుతూ… యువతులు లైంగిక వేధింపులకు, ఈవ్ టీజింగ్‌లకు, ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చైల్డ్ ఆర్గనైజేషన్ జిల్లా నాయకురాలు ఝాన్సీ మాట్లాడుతూ… పిల్లల్ని చిన్న తనం నుంచి సమానంగా పెంచాలని, అన్ని అవకాశాలు కల్పించాలని ఆడపిల్లను తక్కువగా చూడొద్దన్నారు. మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.