- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చావు బతుకుల్లో ఉన్న నన్ను కాపాడారు.. మళ్లీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చారంటూ..!
దిశ, కాటారం : ప్రాణాపాయంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ మహిళను వైద్యులు రక్షించారు. కానీ, మళ్లీ ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చిందంటూ బాధిత మహిళ ఆస్పత్రి బయట తన పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శనివారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని మల్హర్ మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన బాలగొని భవాని ఈ నెల 3న కుటుంబ తగాదాల కారణంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు ఆమెను తొలుత స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతర మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లిలోని గ్లోబల్ కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మూడు రోజుల చికిత్స తర్వాత డిశ్చార్జి అయిన మహిళ.. మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెల తాడు కనిపించడం లేదని, ఒరిజినల్ స్థానంలో నకిలీది వచ్చిందని బోరున విలపించింది. దాని విలువ రూ. లక్షా ఇరవై వేలు ఉంటుందని బాధితురాలు పేర్కొంది.
బాధితురాలు, ఆమె తల్లి మాచర్ల రాజక్కల కథనం ప్రకారం.. గ్లోబర్ ఆస్పత్రిలో మూడు రోజులు చికిత్స అనంతరం రూ.80 వేలు బిల్లు వేయగా అది చెల్లించామన్నారు. ఈ క్రమంలోనే పక్క బెడ్డుపై ఉన్న తాడిచెర్ల గ్రామానికి చెందిన మహిళ తమ్మిశేట్టి శారద గమనించి పుస్తెలు తిరగబడి ఉన్నాయని, సరిచేసుకోవాలని చెప్పడంతో చూసుకుని ఒక్కసారిగా షాక్ అయినట్టు భవానీ ఆవేదన వ్యక్తం చేసింది.. అసలు బంగారు తాడు మాయమై నకిలీ తాడు మెడలోకి వచ్చిందని బాధిత మహిళ వెంటనే ఆస్పత్రి యజమాని, వైద్యులకు విన్నవించినట్టు తెలిపింది. ఆస్పత్రి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినట్లుగా తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం సూచన మేరకు భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా న్యాయం జరగలేదని బాధిత మహిళ వాపోయింది. దీంతో ఆస్పత్రి ఎదుట తన పిల్లలతో కలిసి ఆందోళనకు దిగింది. బంగారం ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటానని, లేనియెడల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని భవాని హెచ్చరించింది. తన వైద్యం ఖర్చు రూ.80వేలు అవ్వగా అప్పులు చేసి చెల్లించినట్టు తెలిపింది. ఆస్పత్రి సిబ్బందే తనకు చికిత్స అందించే టైంలో తన పుస్తెల తాడును మాయం చేశారని ఆరోపించింది. వెంటనే తనకు న్యాయం చేయాలని లేనియెడల ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.