- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వాళ్లే.. సిటీ పోలీసుల బలం : CP అంజనీ కుమార్

దిశ, చార్మినార్: మహిళా పోలీసు అధికారుల సేవలను హైదరాబాద్ నగర పోలీసులు ఎల్లవేళలా గౌరవిస్తారని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మహిళా పోలీసులు అత్యంత గౌరవప్రదంగా విధులు నిర్వర్తించే విధంగా అలవాటును పెంపొందించుకోవాలన్నారు. హైదరాబాద్ పేట్ల బూర్జులోని కార్‌హెడ్ క్వార్టర్స్‌లో గురువారం జరిగిన “మహిళా పోలీసు అధికారులు హైదరాబాద్ సిటీ పోలీసుల బలం” అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంజనీ కుమార్ హైదరాబాద్ నగరంలోని మహిళా పోలీసు అధికారులందరిని జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా పోలీసుల ఫిర్యాదులన్నింటినీ అధికారులు శ్రద్ధగా వింటారన్నారు. అలాగే వాటి పరిష్కారం కోసం వారు ఎప్పుడైనా సీనియర్ అధికారులను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అడీషనల్ సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీలు సునీతారెడ్డి, గజరావుభూపాల్, చార్మినార్ ఉమెన్స్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జానకమ్మ తదితరులు పాల్గొన్నారు.