- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తనను కాదని.. వేరొకరితో అలా ఉన్నందుకు వివాహితను రేప్ చేసి, తలపై..!
దిశ, జడ్చర్ల : తనను కాదని.. ఓ మహిళ వేరొక వ్యక్తితో చనువుగా ఉండడాన్ని జీర్ణించుకోలేక ఆమెను దారుణంగా హతమార్చిన ఘటనలో ఎట్టకేలకు పోలీసులు పురోగతిని సాధించారు.సీఐ జమ్ముప్ప మంగళవారం మిడ్జిల్ మండల కేంద్రంలోని పీఎస్‌లో ఎస్సై జయ ప్రసాద్, ట్రైనీ ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌లతో కలిసి నిర్విహించిన విలేకరుల సమావేశంలో నిందితుడు ఆవుల వెంకటయ్య (55)ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల 22న మిడ్జిల్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన శంకరయ్య గౌడ్ తన భార్య లక్ష్మీదేవమ్మ (40) కల్వకుర్తికి చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్ వెంకటేశ్వర చారి కారులో.. జడ్చర్లలో చదువుకుంటున్న తన కూతురి వద్దకు వెళ్లింది. ఆమెను కలిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో మిడ్జిల్ మండలం మన్ననూర్ గ్రామం వద్ద తనకు వేరే పని ఉందని కారులో నుంచి దిగి వెంకటేశ్వర చారిని వెళ్లిపోమ్మని చెప్పింది.
మరల అక్కడి నుంచి బస్సులో బోయిన్ పల్లి గ్రామానికి చేరుకుంది. ఆ తర్వాత మల్లాపూర్‌కు చెందిన ఆవుల వెంకటయ్య తన బైకుపై లక్ష్మీదేవిని తీసుకుని బోయిన్ పల్లి గ్రామ శివారులోని పీర్ల గుట్ట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె ఒంటిపై ఉన్న 6 తులాల బంగారు నగలను లాక్కుని.. లక్ష్మీ దేవమ్మ పై అత్యాచారం చేశాడు. అనంతరం బండరాయితో మోది హత్య చేశాడు. గత నెల 23న మృతురాలి భర్త తన భార్య లక్ష్మీదేవమ్మ 22వ తేదీ నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని లక్ష్మీదేవమ్మ కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరించారు పోలీసులు. అదే రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బోయినపల్లి వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం ఉందని గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శంకరయ్య గౌడ్ కుటుంబ సభ్యులను పిలిపించి మృతదేహాన్ని చూపించగా, చనిపోయింది తన భార్య లక్ష్మీదేవమ్మనే అని గుర్తించారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా మృతురాలి ఊరు మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆవుల వెంకటయ్య కూడా ఈనెల 22 నుంచి కనిపించకపోవడంతో మృతురాలి బంధువులు అతనిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ కోణంలో దర్యాప్తు జరిపిన పోలీసులు మంగళవారం తెల్లవారు జామున బోయిన్ పల్లి గ్రామ శివారులో వెంకటయ్య తిరుగుతుండగా పట్టుకుని బైకు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆ హత్య తానే చేశానని ఒప్పుకున్నట్టు సీఐ తెలిపారు. తనతో చనువుగా ఉండే లక్ష్మీదేవమ్మ ఇటీవల వేరొకవ్యక్తితో చనువుగా ఉండడాన్ని జీర్ణించుకోలేకనే పథకం ప్రకారం లక్ష్మీదేవమ్మ పై అత్యాచారం చేసి బండరాయితో మోది హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడిపై హత్యానేరం మోపి రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. హత్య కేసును 10 రోజుల్లో ఛేదించిన మిడ్జిల్ ఎస్సై విజయప్రసాద్, కానిస్టేబుల్ రవీందర్, వెంకటయ్య, బాలు సిబ్బందిని జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ కిషన్ అభినందించినట్టు సీఐ జమ్ముప్ప తెలిపారు.