- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దోషం ఉందంటూ తాళి కట్టాడు..!
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: దోషం ఉందంటూ ఓ మహిళకు తాళి కట్టాడు నకిలీ జ్యోతిష్యుడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్‌బీ కాలనీకు చెందిన కోసూరి మాధవ్ అనే జ్యోతిషుడిని ఓ మహిళ ఆశ్రయించింది. మీ భర్తకు దోషం ఉందని.. పూజలు చేయకుంటే చనిపోతాడని మహిళను భయబ్రాంతులకు గురిచేశాడు. భర్త లేని సమయంలో జ్యోతిషుడు సదురు మహిళ ఇంట్లో పూజలు చేశాడు. పూజలు చేస్తున్న క్రమంలో ఆమె మెడలో తాళి కట్టి ఫోటోలు తీశాడు. అనంతరం ఆ ఫోటోలను చూపించి మహిళను వేధించసాగాడు. దీంతో నకిలీ జ్యోతిషుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు మాధవ్‌ను అరెస్ట్ చేశారు.
Next Story