- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉద్యోగం పోయిందని మనోవేదనతో ఫీల్డ్ అసిస్టెంట్ మృతి..
దిశ, ఆత్మకూర్(ఎం) : ఓ వైపు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే మరో వైపు ఉన్న ఉద్యోగాలు పోయి మనోవేదనకు గురయ్యి బలవన్మరణాలకు పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఉమ్మడి ఆత్మకూరు(ఎం) మండలంలోని కొండాపురం గ్రామంలో గురువారం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. కొండాపురం గ్రామపంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించే కొప్పుల సబితకు గత కొంత కాలంగా ఉద్యోగం లేకపోవడంతో ఇళ్ళు గడవలేని స్థితి ఏర్పడింది. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక క్షోభకు గురై అనారోగ్యం పాలైంది. క్రమంగా ఆరోగ్యం క్షీణించడంతో గురువారం తుదిశ్వాస విడిచింది. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బబ్బురి శంకర్ పరామర్శించారు.
19 నెలలుగా విధుల్లోకి తీసుకోకుండా ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నదన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 53 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు చనిపోయారని ఈ సందర్బంగా గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఉద్యోగాలను తిరిగి ఇప్పించాలని, అదేవిధంగా చనిపోయిన సబిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. మృతురాలి భర్త కూడా మరణించడంతో ఇద్దరు కూతుర్లు అనాథలుగా మారారు. వారు మాట్లాడుతూ.. తమ తల్లి చావుకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.