- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడేళ్ల లాసెట్‌లో తొలిర్యాంకు యువతికే
దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన మూడు లా కోర్సుల ప్రవేశ పరీక్షా ఫలితాల్లో సగటున 76.87% ఉత్తీర్ణత నమోదైంది. గత నెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మూడేళ్ళ ఎల్ఎల్‌బీ కోర్సు, ఐదేళ్ళ ఎల్ఎల్‌బీ కోర్సు, రెండేళ్ళ ఎల్ఎల్ఎమ్ కోర్సుల ప్రవేశ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి శుక్రవారం విడుదల చేశారు. మూడేళ్ళ లా కోర్సులో 78.60 శాతం, ఐదేళ్ళ లా కోర్సులో 62.35 శాతం, రెండేళ్ళ ఎల్ఎల్‌ఎం కోర్సులో 91.04 శాతం చొప్పున ఉత్తీర్ణత నమోదైంది. మూడేళ్ళ ఎల్ఎల్‌బీ కోర్సులో చుండి స్నేహ శ్రీ 98 మార్కులు (100కు) సాధించి తొలి ర్యాంకు సాధించగా, ఐదేళ్ళ లా కోర్సులో సముద్రాల శ్రీనివాస కృష్ణ పాంచజన్య 98 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. రెండేళ్ళ ఎల్ఎల్‌ఎం కోర్సులో సిరిసిల్లకు చెందిన తడిగొప్పుల ప్రవళిక 89 మార్కులతో మొదటి స్థానంలో నిలిచారు. ఐదేళ్ళ లా కోర్సు, రెండేళ్ళ ఎల్ఎల్‌ఎం కోర్సుల్లో టాప్ టెన్ ర్యాంకర్లలో ఐదుగురు చొప్పున యువతులు రాణించారు.
గత నెల 9వ తేదీన జరిగిన ఈ ప్రవేశ పరీక్షల్లో మూడేళ్ళ కోర్సుకు 21 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా పరీక్షలు హాజరైన 15 వేల మందికి పైగా అభ్యర్థుల్లో 12 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. ఐదేళ్ళ లా కోర్సుకు 5677 మంది దరఖాస్తు చేసుకోగా 3973 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 2477 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల ఎల్ఎల్‌ఎం కోర్సు ప్రవేశ పరీక్షకు 2689 దరఖాస్తు చేసుకోగా 2188 మంది హాజరయ్యారు. 1992 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 100% పాస్
మూడు రకాల ప్రవేశ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారు. ఎస్సీ అభ్యర్థులు 6429 మంది దరఖాస్తు చేసుకోగా 4454 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారంతా ఉత్తీర్ణులైనట్టు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు. ఎస్టీ అభ్యర్థులు 1910 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 1342 మంది పరీక్షలు రాశారు. వీరంతా ఉత్తీర్ణులయ్యారు.