- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంకుడు గుంత తవ్వుకుంటుంటే దాడి
దిశ, రంగారెడ్డి: ఆమె ఒక ప్రజాప్రతినిధి అని కూడ చూడలేదు. తన భర్తపై దాడి జరుగుతుంటే అడ్డుకోబోయింది. దీంతో ఆమెపైనా దాడి చేశారు. ఈ ఘటన ముర్తుజగూడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మహిళ ఉప సర్పంచ్ జవ్వొజి వసంత తన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సబంధించి వివరాలు ఆమె మాటల్లోనే..‘ మా ఇంటి నుంచి వెలువడే మురుగునీరు బయటకు పోకుండా ఉండటం కోసం నేను, నా భర్త మా పెరట్లోని ఖాళీ స్థలంలో ఇంకుడు గుంత తవ్వుకుంటున్నాం. అయితే మా ఇంటి పక్కనే ఉండే కాంగ్రెస్ నాయకులు అవురం విక్రమ్‌రెడ్డి, అవురం కృష్ణారెడ్డి అకారణంగా మాతో గొడకు దిగారు. మా స్థలంలో మేము గుంత తీసుకుంటుంటే మీ అభ్యంతరమేంటని ప్రశ్నించిన నా భర్తపై దాడికి ప్రయత్నించారు. నా భర్తను తప్పించేందుకు ప్రయత్నించిన నాపై, నా మరిదిపై విక్రమ్‌రెడ్డితో పాటు అతనితో వచ్చిన తెలుగు బిక్షపతి, పాలమాకుల కృష్ణాయాదవ్, కమ్మెట వెంకట్‌రెడ్డి, సామ మాణిక్యరెడ్డి, పోగాకు గిరిబాబు, సప్పిడి చిన్న పెంటారెడ్డి, కానపురం కుమార్ తదితరులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాను’. అని వసంత తెలిపారు.