సెలబ్రిటీ c/o రైల్వే ప్లాట్‌ఫాం

by Shyam |
సెలబ్రిటీ c/o రైల్వే ప్లాట్‌ఫాం
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ప్లాట్ ఫాం లైఫ్ ఇస్తుంది కరెక్టే కానీ… రైల్వే ప్లాట్ ఫాం కూడా లైఫ్ ఇస్తుందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈ మధ్య రైల్వే ప్లాట్ ఫాంపై సాంగ్ పాడిన రోను మోండల్ అనే మహిళ పాపులర్ సింగర్ అయిపోయింది. వెస్ట్ బెంగాల్ రైల్వేస్టేషషన్‌లో లతా మంగేష్కర్ పాట పాడిన ఆమె… ప్లే బ్యాక్ సింగర్‌గా సెటిల్ అయిపోయింది. మంచి జీతభత్యాలు, కారు, ఇల్లుతో సుఖంగా జీవిస్తోంది. కేరాఫ్ ప్లాట్‌ఫాం అనుకున్న ఆమె లైఫ్… కేరాఫ్ బాలీవుడ్‌గా చేంజ్ అయింది.

ఇలాంటి ఒక ఘటనే లండన్ ట్రైన్ స్టేషన్‌లోనూ జరిగింది. ‘ఫినిష్ ద లిరిక్స్’ పేరుతో ఒక ఛానల్‌కు చెందిన యాంకర్ ‘కెవిన్’ ఓ గేమ్ ఆడుతుంటాడు. ఒక పాటను ఎంచుకుని దాని లిరిక్స్ కంప్లీట్‌గా పాడాలని కోరుతాడు. ఈ క్రమంలోనే ‘చార్లొటే ఆబెరి’ అనే మహిళను కూడా అడిగాడు కెవిన్. ‘లేడి గాగ’ ‘షాలో’ లిరిక్స్ పాడాలని కోరగా… ఆమె పాట పాడిన విధానానికి, వాయిస్‌కు ఫ్లాట్ అయ్యాడు. ప్లే బ్యాక్ సింగర్‌గా సెటిల్ అయిపోవచ్చంటూ కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చాడు. ఈ వీడియో కాస్త ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా… తన స్టన్నింగ్ వాయిస్‌కు భారీ రెస్పాన్సే వచ్చింది. ఫేస్‌బుక్‌తోపాటు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వీడియో వైరల్ అయింది. ఫేస్‌బుక్‌లో 15 మిలియన్ వ్యూస్ రాగా ట్విట్టర్‌లో 24 మిలియన్ వ్యూస్‌తో వీడియో ట్రెండింగ్‌లో ఉంది. మొత్తానికి ఈ మహిళ త్వరలో సింగర్ అవ్వడం కన్‌ఫాం అంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed