చెంచు మహిళ ఆత్మహత్య

by Shyam |
చెంచు మహిళ ఆత్మహత్య
X

దిశ, అచ్చంపేట: నియోజకవర్గ పరిధిలోని అమ్రాబాద్ మండలం బి.కే తిరుమలాపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళ శనివారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తమ్ముడు కుడుముల చిన్న పోలయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శీలం పోలమ్మ (30) అనే మహిళ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నది. ఆరోగ్య విషయమై డాక్టర్లతో వైద్యం చేయించినప్పటికీ ఎంతకూ తగ్గలేదు. రోజూలాగే అందరూ తిని పడుకున్న తరువాత, అర్ధరాత్రి సమయంలో వెనక గదిలో ఉరి వేసుకుని చనిపోయింది. తన తల్లి పక్కన లేదని గమనించిన కూతురు వెనక గదిలోకి వెళ్లి చూడగా, అప్పటికే తల్లి శవమై వేలాడుతున్నది. విషయం తెలిసిన అమ్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతురాలిని పోస్టుమార్టం నిర్వహించి, తదుపరి పోలమ్మ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed