రైలు రాకుంటే రాజును పట్టుకునేటోళ్లం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షులు

by Sumithra |   ( Updated:2021-09-16 07:46:53.0  )
Witness, accused rape
X

దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీకి చెందిన చిన్నారి హత్యాచార నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్-చిల్పూర్ మధ్యనున్న రాజవరం రైల్వే బిడ్జి సమీపంలో పట్టాలపై రైలుకు ఎదురుగా పరిగెత్తి దానికింద పడి మృతిచెందాడు. ఈ క్రమంలోనే రాజు ఆత్మహత్య చేసుకుంటుండగా కొందరు వ్యక్తులు ప్రత్యక్షంగా చూశారు. చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల శివారు గేమియా తండాకు చెందిన సదరు ప్రత్యక్ష సాక్ష్యులు భూక్య గేమ్ సింగ్, భూక్య రామ్ సింగ్ మీడియాతో ఆసక్తికర విషయాలు తెలిపారు.

Witness, accused rape

‘‘ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలోని మా పొలంలో యూరియా చల్లుతున్నాము. అదే సమయంలో రైల్వే ట్రాక్‌ను పరిశీలిస్తున్న ఇద్దరు లైన్‌మెన్‌లు మా వద్దకు వచ్చారు. వారు మాతో మాట్లాతుండగానే రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి పరిగెడుతున్నాడు. అదే సమయంలో హైదరాబాద్‌ వైపు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ దూసుకువస్తోంది. రైలు వస్తోందని మేము గట్టిగా అరిచాము. అతడు ట్రాక్ దిగినట్టే దిగి మళ్లీ రైలుకు ఎదురు పరిగెత్తాడు. దీంతో ఎదురుగా వచ్చిన రైలు ఒక్కసారిగా రాజు మీదనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో రైలు రాకపోయి ఉంటే మేము అతన్ని పట్టుకునేవాళ్లం.’’ అని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story