- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలకులతో రైతులకు నష్టం : కోదండరాం
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర పాలకులతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే విషయంలో పలు డిమాండ్లు పెట్టారు. రాష్ట్రంలో ఖరీఫ్ వడ్ల కొనుగోలు ఇంకా పూర్తి కాకముందే యాసంగి వడ్లను కొనబోమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేల్చడంపై మండిపడ్డారు. రైతుల సమస్యలు పక్కన పెట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వానాకాలం వడ్లు కొనుగోలును వేగవంతంగా పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతులపై జరుగుతున్న దోపిడీని నిలువరించాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ డిమాండ్లు నెరవేర్చేలా ఆందోళనలు చేపట్టాలని అఖిలపక్షం నేతలు నిర్ణయించారు. ఈనెల 7వ తేదీన జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాల సమీపంలో రాస్తారోకో, దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే 9వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్‌లో రైతుల ధర్మాగ్రహ దీక్షకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం, సీపీఐ నాయకుడు చాడా వెంకట్ రెడ్డి, న్యూ డెమొక్రసీ నేతలు పోటు రంగారావు, సాదినేని వెంకటేశ్వర రావు, టీడీపీ నేత శ్రీపతి సతీష్, ఇంటి పార్టీ నాయకుడు సందీప్ పాల్గొన్నారు.