కార్డు లేదా… చీరె లేదు..!

by Anukaran |
కార్డు లేదా… చీరె లేదు..!
X

దిశ, సూర్యాపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఆడపడుచుల పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరె పేద ప్రజలందరికీ అందడం లేదు. రేషన్ కార్డు ఉంటేనే బతుకమ్మ చీరె ప్రభుత్వం ప్రకటించడంతో కొంతమందిక చీరెలు అందెలా కనిపించడంలేదు. 18 ఏం డ్లు నిండి, రేషన్ కార్డులో పేరు ఉన్నవారికి మాత్రమే అందనున్నాయి. 225 రకాల డిజైన్లు కలిగిన చీరెలు ఇప్పటివరకూ 3,20,000 చీరెలు జిల్లాకు చేరాయి. వీటిని ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. చీరెల ను సెర్ప్ అధికారులు నేరుగా ఇంటిం టికీ వెళ్లి పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో 3,76,838 మందికి బతుకమ్మ చీరెల పంపిణీ చేయనున్నారు.

సుమారు 15 వేల మందికి కోత..

18 ఏళ్లు నిండిన ఆడపడుచుల అందరికీ బతుకమ్మ చీరెలు అంటూనే రేషన్ కార్డు నిబంధన విధించడంతో సుమారు 15 వేల మందికి చీరె అందకుండా పోనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత ఇప్పటివరకు ఒక రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు. దీంతో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పద్దెనిమిదేళ్లు నిండిన యువతుల పేర్లు నమోదు కాలేదు. కొత్త రేషన్ కార్డు కొరకు ఆన్‌లైన్‌ లో జిల్లాలో సుమారు 20వేల పైచిలుకు మంది ద రఖాస్తు చేసుకోగా.. అవి అధికారుల వద్ద పెండిం గ్‌లో ఉన్నాయి. రేషన్ కార్డు నిబంధనలు తొలిగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు..

బతుకమ్మ చీరెల పంపిణీ లో రేషన్ కార్డు ప్రామాణికం కాకుం డా పంపిణీ చేయాలి. అలా చేస్తే అర్హత కలిగిన ఏ ఒక్కరికి ఆ న్యాయం జరగదు. ప్రభుత్వం పునరాలోచించి బతుకమ్మ చీరెల పంపిణీలో నిబంధనలు సడలించాలి. ఈ ఐదు ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు. – ఎం.రోజా, ఎంపీటీసీ

విధివిధానాలు రాగానే..

బతుకమ్మ చీరెలు ఇప్పటికే 80 శాతం జిల్లాకు చేరుకున్నాయి. మిగిలిన చీరెలు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. వాటిని జిల్లా కేంద్రంలో భద్రపర్చాం. సివిల్ సప్లయ్, మార్కెటిం గ్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చీరెలను పంపిణీ చేయనున్నాం. చీరల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి విధివిధానాలు రావాల్సి ఉంది. – ఎండీ జాహిరుద్దీన్, ఏడీ చేనేత, జౌళి శాఖ, సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జి

Advertisement

Next Story

Most Viewed