నేల రాలుతున్న పక్షులు.. 24 గంటల్లో 165 మృతి

by Anukaran |
నేల రాలుతున్న పక్షులు.. 24 గంటల్లో 165 మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజస్థాన్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. కేవలం 24గంటల వ్యవధిలో 165 పక్షులు నేల రాలినట్లు రాష్ట్ర పశుసంరక్షణ శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. చనిపోయిన పక్షుల్లో మొత్తంగా 67 శాంపిల్స్ తీసుకుని బర్డ్ ఫ్లూ పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్దారణ అయిందన్నారు. ఇదిలాఉండగా, డిసెంబర్ 25 నుంచి ఇప్పటివరకు మొత్తంగా 5,295 పక్షులు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story