- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న విప్రో..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ విప్రో సంస్థ సోమవారం(సెప్టెంబర్ 13) నుంచి ఉద్యోగులు ఆఫీసులకు రావాలని సంస్థ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఆదివారం వెల్లడించారు. గత ఏడాది, రెండేళ్ల నుంచి రీమోట్ వర్క్ చేస్తున్న ఉద్యోగులు ఇకపై వారంలో రెండు రోజులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని, 18 నెలల సుధీర్ఘ కాలం అనంతరం తమ ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి రానున్నారు. సంస్థలోని ఉద్యోగులందరికీ కొవిడ్ టీకా అందించాం. ఉద్యోగులందరూ ఆఫీసులకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రిషద్ తెలిపారు.
అంతేకాకుండా, కొవిడ్ మహమ్మారి పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో విప్రో సంస్థ ఆఫీసుల్లో తగిన నిబంధనలను పాటిస్తామని, కార్యాలయాల్లో తగిన భౌతిక దూరంతో పాటు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, ఈ ఏడాది జూలై రెండో వారంలో సంస్థ వార్షిక సమావేశంలో ప్రేమ్‌జీ దేశీయంగా ఉన్న ఉద్యోగుల్లో 55 శాతం మంది కరోనా టీకా అందించినట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం విప్రో సంస్థలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు.