- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్ఇండియా'ను దక్కించుకోవడం కీలక మైలురాయి: టాటా ఛైర్మన్
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఏడాదిలో విమానయాన సంస్థ ఎయిర్ఇండియాను దక్కించుకోవడం సంస్థకు అత్యంత కీలక మైలురాయిగా భావిస్తున్నానని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. సోమవారం ఆయన సంస్థ ఉద్యోగులకు పంపిన లేఖలో 2021 మరో కఠినమైన ఏడాదిగా ముగియనుంది. ఈ ఏడాది మెరుగైన ఆర్థిక పనితీరు మాత్రమే కాకుండా గ్రూప్ కొత్త వ్యాపార వ్యూహాన్ని అమలు చేయడంలో మెరుగ్గా రాణించామని చెప్పారు. ఎయిర్ఇండియా బిడ్‌ను గెలవాలనే మా ప్రయత్నం ముగిసింది. ఇది తమకు ఒక చారిత్రాత్మమైన సమయమని చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. టాటా గ్రూప్ విజయవంతంగా వ్యూహాన్ని అనుసరించడంలో డిజిటల్, కొత్త బలం, సరఫరా వ్యవస్థ, సంస్థ ఆరోగ్యకరమైన పనితీరు ఎంతో దోహదం చేశాయన్నారు.
‘టాటా గ్రూప్ సంస్థలు ఇప్పటికే పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకున్నాయి. వాటి బలమైన పనితీరును చూస్తున్నాం. కొత్త భాగస్వాములు, వ్యాపారాలు, 5జీ, టాటాన్యూ, టాటా ఎలక్ట్రానిక్స్ మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని’ ఆయన వివరించారు. 2020లో భారత ఆర్థికవ్యవస్థ 8.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇది ప్రపంచ సగటు 4.9 శాతం కంటే ఎక్కువ. అంతేకాకుండా 2024 నాటికి భారత్ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారేందుకు మన వంతు పాత్ర పోషిద్దామని లేఖలో పేర్కొన్నారు. ‘ ఇప్పటికే టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్థిరత్వాన్ని కలిగి ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగాలని నమ్ముతున్నానని’ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.