నో పెళ్లి అంటూనే.. పెళ్లికి సిద్ధమైన యంగ్ హీరో

by Anukaran |
నో పెళ్లి అంటూనే.. పెళ్లికి సిద్ధమైన యంగ్ హీరో
X

మొన్నటివరకు టాలీవుడ్ బ్యాచిలర్ హీరోలంతా.. ‘సింగిల్ ఆర్మీ’ వాట్సాప్ గ్రూపులో సోలోగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు తమ స్నేహితులందరికీ బైబై చెప్పుకుంటూ.. అదే చేతితో తమ శ్రీమతి చేయి పట్టుకున్నారు. ఈ బ్యాచ్‌లో మొదట యంగ్ హీరో నిఖిల్.. ‘నేను ఎంగేజ్ అయిపోయాను.. మిస్ యూ గాయ్స్’ అంటూ మెసేజ్ పెట్టాడు. అదే బాటలో నితిన్ కూడా మరికొన్ని రోజుల్లో ‘భీష్మలా ఇక ఉండలేను. సింగిల్ టైమ్ అయిపోయింది.. జీవితాంతం మింగిల్ అవుతున్నాను, సైనింగ్ ఆఫ్’ అంటూ పెళ్లి పీటలెక్కేశాడు. ఇక టాలీవుడ్ హంక్ రానా.. తన ప్రేయసికి ఐ లవ్ యూ చెప్పేసి, ‘ఇది ఒక హఠాత్ పరిణామం.. సారీ రా అబ్బాయ్‌లు’ అంటూ మిహికాతో జట్టు కట్టాడు. ఇక ఇప్పుడు ఆ సింగిల్ ఆర్మీ నుంచి మరో బ్యాచిలర్ హీరో కూడా టాటా చెప్పేసే టైమ్ వచ్చేసిందంటున్నాడు.

‘నో పెళ్లి .. దాని తల్లి.. ఈ తప్పే చేయకురా వెళ్లి’ అనే పాటతో యంగ్ బ్యాచిలర్స్ అందరికీ పెళ్లి వద్దంటూ ఉపదేశమిచ్చాడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కానీ విచిత్రంగా ఈ పాట విడుదలైన కొన్ని రోజుల్లోనే.. సాయి పెళ్లి పాట పాడుతున్నాడు. అవును.. స్వయంగా సాయి ఈ విషయం చెబుతున్నాడు. తన ట్విట్టర్లో ‘మనం ఎన్నో అనుకుంటాం.. కానీ ఆ టైమ్ వచ్చినప్పుడు తప్పదు మరి’ అని చెప్పుకురావడమే కాదు, సింగిల్ ఆర్మీ గ్రూపులో ప్రభాస్‌కు సారీ కూడా చెప్పాడు. అయితే, పూర్తి వివరాలు తెలియాలంటే.. రేపు ఉదయం 10 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే. అదేంటో గానీ, నితిన్ సింగిల్ పాట పాడగానే ఏడడుగులు వేశాడు. ఇప్పుడు ‘నో పెళ్లి’ అన్న తేజ్ కూడా మూడు ముళ్లు వేసేందుకు సిద్ధపడుతున్నాడు. దీన్ని దేవుని ట్విస్ట్ అంటారేమో.

ఇదిలా ఉంటే సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సోలో బతుకే సో బెటర్’ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సాయి ఇలా చెబుతున్నప్పటికీ.. ఇదంతా ‘సోలో బతుకే సో బెటర్’ చిత్ర ప్రమోషన్‌లో భాగమని కొందరు కామెంట్ చేస్తుండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed