- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గ్రహాంతరవాసిలా ఉన్న గొర్రె.. మీకు తెలుసా?
దిశ, ఫీచర్స్ : ఈ ఫొటో చూసి గ్రహాంతరవాసి అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే ఫొటోలో ఉన్నది గ్రహాంతరవాసి కాదు, అలా కనిపించే గొర్రె. మరి గొర్రె ఇలా ఎందుకు కనిపిస్తోందనేగా మీ డౌట్! కొన్నేళ్ల నుంచి దాని శరీరంపై ఉన్నిని తీయకపోవడం వల్ల పెరిగిపోయి ప్రస్తుతం గ్రహాంతరవాసిని తలపిస్తోంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు ఉత్తరాన 60 కిలోమీటర్ల దూరంలో గల ఎడ్గర్ మిషన్ వ్యవసాయ అభయారణ్యంలో స్థానికులు కొందరు ఈ గొర్రెను గుర్తించారు. దానికి బారక్(baarack) అని పేరు కూడా పెట్టారు. ఉన్ని బాగా పెరిగిపోవడం వల్ల అది పెద్ద గొంగడి కప్పుకున్నట్లు అనిపిస్తుండగా.. ప్రస్తుతం దాని శరీరంపైనున్న 35.4 కిలోల ఉన్నిని తొలగించారు. అయితే ఇంకొన్ని రోజులు ఇలాగే ఉంటే, ఉన్ని బరువును మోయలేక మృత్యువాతపడే అవకాశముండేదని స్థానికులు వెల్లడించారు. కాగా, ఇప్పుడు నార్మల్‌గా మారిన బారక్.. ఎడ్గర్ మిషన్ అభయారణ్యంలో తిరుగుతోంది.