కరోనాపై వాస్తవ సమాచారం కోసం వికీ కృషి

by vinod kumar |
కరోనాపై వాస్తవ సమాచారం కోసం వికీ కృషి
X

దిశ వెబ్ డెస్క్: కరోనా వైరస్ గురించి సోషల్ మీడియాలో రోజురోజుకు ఫేక్ న్యూస్ సర్క్యూలేషన్ ఎక్కువ అవుతోంది. ఫేక్ వార్తలతో ప్రజల్లో ఇంకా భయాందోళన రేకితిస్తున్నారు నెటిజన్లు. ఎప్పటివో… ఏనాటి ఫోటోలు, వీడియోలను .. కరోనా మరణాలకు, కరోనా భాదితులకు లింక్ చేస్తూ… సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని సమచారాన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ.. వైరల్ చేస్తున్నారు. అలాంటి ఫేక్ వార్తలపై అవగాహన పెంచుకునేందుకు.. వికీ కృషి చేస్తోంది. ప్రజలకు వాస్తవాన్ని సమాచారాన్ని మాత్రమే చేర్చాలని ప్రయత్నిస్తోంది. తెలుగుతో పాటు, మరో 10 భారతీయ భాషల్లో కరోనా సమాచారాన్ని అందించడం కోసం వికీపీడియా సంపాదకుల బృందం .. స్థానికి యూనివర్సిటీల సాయాన్ని కోరుతోంది.

కరోనా గురించి సోషల్ మీడియాలో అవాస్తవ సమాచారం వ్యాప్తి చెందడంతో .. కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా గురించి వాస్తవ సమాచారం, వార్తల తో పాటు, అవగాహన, జాగ్రత్తలు తదతర అంశాలను ప్రజలకు అందించేందుకు ట్విట్టర్ ఖాతా ఇటీవలే లాంచ్ చేసింది. గూగుల్, వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థలు కూడా ఫేక్ వార్తలను ఏరే పనిలో ఉంది. పోలీస్ శాఖ కూడా ఫేక్ న్యూస్ పై సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. ఇదే బాటలో వికీపీడియా కూడా నడవనుంది. కరోనా గురించి వికీ ఆంగ్లంలో విస్తృత సమాచారం ఉంది. ఈ పేజీని రోజుకు రెండు లక్షల మంది సందర్శిస్తున్నారు. కరోనాకు సంబంధించిన శాస్త్రీయ సమాచారం అన్ని భాషల్లో అందుబాటులో లేదు. ఆంగ్లంలోని సమాచారాన్ని ఆయా స్తానిక భాషల్లో అందించేందుకు స్థానిక విశ్వవిద్యాలయాలు సాయం అందించాలని వికీపీడియా వలంటీర్ ఎడిటర్ అభిషేక్ పిలుపునిచ్చారు. కేవలం వాస్తవ సమచారాన్ని మాత్రమే అందించాలన్నారు. ఆరోగ్య సమాచారాన్ని అందించేందుకు వికీపీడియా కొత్తగా ‘స్వస్థ’ అనే గ్రూపును కూడా ఏర్పాటు చేసింది.

Tags: coronavirus, fake news, wikipedia, telugu,misinformation, 10 languages

Advertisement

Next Story

Most Viewed