ఇంట్లో ప్రియుడితో భార్య.. కొడుకు కోసం వచ్చిన భర్త.. చివరికి…

by Sumithra |
ఇంట్లో ప్రియుడితో భార్య.. కొడుకు కోసం వచ్చిన భర్త.. చివరికి…
X

దిశ, కుత్బుల్లాపూర్ : ప్రియుడి మోజుతో నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లే కసాయిగా మారి హత్య చేసింది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గీరిగుట్టకు చెందిన సురేష్ కు ఉదయ అనే యువతితో మూడేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఉమేష్(3) కుమారుడున్నాడు. మేస్త్రీ పని చేస్తూ సురేష్ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సురేష్ ఇంట్లో లేని సమయంలో భాస్కర్ అనే యువకుడితో భార్య ఉదయ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే ఉదయ గత రెండు సంవత్సరాలుగా భాస్కర్ తో చనువుగా ఉండడాన్ని గమనించిన సురేష్ హెచ్చరించాడు.

అయినప్పటికీ పట్టించుకోకుండా గత రెండు సంవత్సరాల క్రితం కుమారుడు ఉమేష్ ను తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఉదయ. అప్పటినుంచి చింతల్ భగత్‌సింగ్ నగర్ లో ప్రియుడితో కలిసి ఉంటుంది. అప్పుడప్పుడు సురేష్ కుమారుడిని చూసేందుకు భగత్‌సింగ్ నగర్ కు వచ్చేవాడు. ఉమేష్ సాకుతో భాస్కర్ వస్తుండడంతో ఎలాగైనా రాకుండా చేయాలని నిర్ణయించుకుంది భార్య ఉదయ. ఈ క్రమంలో మంగళవారం భర్తపై కోపంతో ఉమేష్ ను తీవ్రంగా కొట్టింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని సురారం లోని మల్లారెడ్డి హాస్పిటల్ కు తరలించింది. అయితే దెబ్బలు తట్టుకోలేక ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఉదయ, భాస్కర్ లు కలిసి ఉమేష్ ను హత్య చేశారని సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story