- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రియుడి కోసం భర్తకు ఊహించని షాకిచ్చిన భార్య
దిశ, ఖమ్మం: ప్రియుడి మోజులో పడి భర్త జేబుకు కన్నం వేసిన భార్య భాగోతాన్ని బయటపెట్టారు ఖమ్మం పోలీసులు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త ఇంటి నుంచే బంగారం, వెండి అభరణాలను దొంగలించి.. చివరకు పోలీసులకు చిక్కింది. మే 4న గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి.. 40 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ల్యాప్‌టాప్ దొంగతనానికి పాల్పడ్డారని ఓ వ్యక్తి మే 5న ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత మే 20న మరోసారి వచ్చిన బాధితుడు మొత్తం 1,330 గ్రాముల బంగారం, 2,330 గ్రాములు వెండి దొంగిలించారని అసలు విషయం చెప్పడంతో పోలీసులు విచారణ వేగవంతం చేసి చివరకు అసలు దొంగలను పట్టుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం జిల్లా కారేపల్లికి ఫైనాన్స్ వ్యాపారి(బంగారం తాకట్టు పెట్టుకునే వ్యాపారి) శివ ప్రకాశ్ 2008లో అర్చన దారక్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం కలిగిన తర్వాత భార్యభర్తలిద్దరి మధ్య మనస్పర్థాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఏడాది నుంచి వేరు వేరుగా ఉంటున్నారు. ముగ్గురు పిల్లలను తన వెంటే ఉంచుకున్న అర్చన గుంటూరులోని తన పుట్టినింట్లో ఉంటుంది. ఇదే సమయంలో మాచెర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన బతుల వెంకట కృష్ణ ప్రసాద్(27)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇక ప్రియుడితోనే జీవించాలని నిర్ణయించుకుంది అర్చన. సరిగ్గా ఇదే సమయంలో శివప్రకాశ్ తల్లి మరణించడంతో అంత్యక్రియలకు హాజరైంది.. ఆ తర్వాత భర్త ఇంట్లోనే ఉంటూ బంగారం, వెండి ఆభరణాలపై కన్నేసింది.
పక్కా ప్రణాళితోనే..
ముందస్తు ప్రణాళిక ప్రకారం దొంగతనం చేసేందుకు ప్రియుడి సహకారం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మే 3వ తేదిన(దొంగతనం చేసే ఒక రోజు ముందు) బతుల వెంకట కృష్ణ ప్రసాద్‌ను కారేపల్లికి పిలిపించింది. ఆ రోజు రాత్రి ప్రియుడు కారేపల్లి రైల్వే స్టేషన్‌లోనే బసచేశాడు. ఆ తర్వాత మే 4న భర్త జేబులో నుంచి లాకర్ తాళాలు తీసుకొని బంగారం, వెండి, ల్యాప్‌టాప్‌ను దొంగిలించి.. ఆ మొత్తాన్ని కృష్ణ ప్రసాద్‌కు అప్పగించింది. వాటిని అమ్మి నగదు సిద్ధం చేయామని సూచించింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టే నటించసాగింది.
ఆ తర్వాత శివప్రకాశ్ మే 5న లాకర్ ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా ఖంగు తిన్నాడు. లాకర్‌లో ఆభరణాలు కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని భావించి పోలీసులను ఆశ్రయించినట్టు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలియజేశారు. నిందితులు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలే వారిని పట్టించాయని ఆయన స్పష్టం చేశారు. వారి నుంచి మొత్తం రూ. 63 లక్షలు విలువ చేసే 1224.890 గ్రాముల బంగారం, 2,340 వెండి, హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న వస్తువులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.