- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయం గురించి తెలిసిందని.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
దిశ, వెబ్ డెస్క్: పచ్చని కాపురాలలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఆకర్షణతో కూడిన మోహం భార్యాభర్తల మధ్య తగువులకు కారణమవుతున్నది. ఈ గొడవలు ఒకరినొకరు చంపుకునేదాకా వెళ్తున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య ఆ విషయం భర్తకు తెలిసిందనే కారణంతో ప్రియుడితో కలిసి ఏకంగా కట్టుకున్నవాడినే హతమార్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.
తమిళనాడులో చోటు చేసుకుంది ఈ ఘటన. విల్లుపురం జిల్లాకు చెందిన లియోబాల్, సుజిత మేరిలకు 2013లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. బతుకుదెరువు నిమిత్తం ఈ కుటుంబం చెన్నైకు సమీపంలో ఉన్న పూవరసం కుప్పంలో నివాసముంటున్నది. కాగా అక్కడే ఉంటున్న రాధాకృష్ణన్‌తో మేరికి పరిచయమైంది. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారి.. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి ఉసిగొల్పింది. ఇద్దరూ పలుమార్లు శారీరకంగా కలిశారన్న విషయం లియోబాల్‌కు తెలిసింది. దీనిపై భార్యాభర్తల మధ్య పలుమార్లు తగువులయ్యాయి. మళ్లీ ఆ పనిచేస్తే ఇంట్లోంచి తరిమేస్తానని లియోబాల్ తన భార్యకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఆ విషయాన్ని మేరి లైట్ తీసుకుంది.
ఈ క్రమంలో గతనెల 4న బంధువుల పెళ్లికని వెళ్లిన లియోబాల్ రెండ్రోజులు గడిచినా ఇంటికి రాలేదు. అతడి ఫోన్ స్విచ్ఛాప్‌లో ఉంది. దీంతో అనుమానమొచ్చిన బాధితుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యను విచారించగా.. భర్త ఏమయ్యాడో తనకు కూడా తెలియదన్నట్టు ఆమె చెప్పింది. ఇదిలాఉండగా కేసు దర్యాప్తు జరుగుతుండగానే ఫిబ్రవరి 21న సుజిత రాధాకృష్ణతో పరారైంది. దీంతో పోలీసులు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధమే లియోబాల్ హత్యకు కారణమై ఉంటుందని అనుమానించారు. అతడి ఇంట్లోని పెరట్లో తవ్వి చూడగా లియోబాల్ మృతదేహం లభ్యమైంది. సుజిత, రాధాకృష్ణల వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలిసిందనే కారణంతోనే వాళ్లే ఈ హత్య చేసి శవాన్ని పెరట్లో పాతి పెట్టారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.