- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తలనొప్పి కుదిర్చిన అక్రమ సంబంధం.. భర్త ఏ టాబ్లెట్ వేశాడంటే..?
దిశ, వెబ్‌డెస్క్ : క్షణిక సుఖాలు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు మహిళలు. కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ భార్యను ప్రేమించే భర్త ఉన్నా.. పెడదారి పడుతున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ భార్యభర్తల బంధాలకు మచ్చ తెస్తున్నారు. సాఫిగా సాగుతున్న సంసారాన్ని నవ్వులపాలు చేసుకుంటున్నారు. పిల్లలను రోడ్డున పడేస్తున్నారు. తాజాగా ఓ ఇల్లాలు మెడికల్ షాప్ యమజానితో పెట్టుకున్న సంబంధం రెండు కుటుంబాలను వీధిన పడేసింది. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అపు కహార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి శ్రీకృష్ణాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆయన భార్యకు తలనొప్పి రావడంతో వారి నివాసానికి సమీపంలో ఉన్న మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు తెచ్చుకుంది. వాటిని వాడినా తగ్గకపోవడంతో మరోసారి అదే మెడికల్ షాప్‌నకు వెళ్లి మరి కొన్ని మెడిసిన్ తెచ్చుకుంది. ఈ క్రమంలో తరచూ మెడికల్ షాప్‌నకు వెళ్తుండటంతో ఆ షాప్ యజమాని మిలాన్‌తో అపు కహార్ భార్యకు పరిచయం పెరిగింది. అది కాస్తా ముదిరి వివాహేతర సంబంధానికి దారి తీసింది.
భర్త బయటకు వెళ్లగానే ఆమె మెడికల్ షాప్‌లో దూరడం అలవాటుగా మారింది. ఈ విషయం తెలుసుకున్న అపు కహార్ భార్యను మందలించాడు. పద్ధతి మార్చుకోమని హెచ్చరించాడు. మిలాన్‌కు సైతం హెచ్చరికలు జారీ చేశాడు. అయినా వారిద్దరిలో మార్పు రాలేదు. దీంతో మిలాన్‌ను అడ్డు తొలగించుకుంటే తన భార్య తనలోనే ఉంటుందని అపు కహార్ భావించాడు.
ఈ క్రమంలో నార్త్ 24 పలగ్రానాస్ ఏరియాలోని నోట్నీ మార్కెట్‌కు వెళ్లిన మిలాన్‌ను ఫాలో అయిన అపు కహార్.. అతడితో గొడవకు దిగి దాడి చేశాడు. మిలాన్‌పై పిడిగుద్దులు కురిపిస్తూ దొరికిన వస్తువులతో విచక్షణరహితంగా దాడి చేశాడు. దీంతో గాయపడిన మిలాన్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసునమోదు చేసి అపు కహార్‌ను అదుపులోకి తీసుకున్నారు.