- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవి ఆరుబయట ఆరేయాలంటే ఎందుకంత ఆందోళన?
దిశ, ఫీచర్స్ : ‘ఉమెన్ ఎంపవర్‌మెంట్’.. సౌండింగ్ అదిరినా, నేటికీ సొసైటీలో అనధికార నిషేధాలపై చర్చించలేని నిస్సహాయతనే మహిళలు ఎదుర్కొంటున్నారు. పైకి అంతా సవ్యంగానే కనిపిస్తున్నా.. పురుషాధిక్య సమాజం వారిని మానసికంగా బంధవిముక్తుల్ని చేయడం లేదు. ఈ పరిస్థితిని వివరించేందుకు లోతుల్లోకి వెళ్లాల్సిన పనిలేదు. సింపుల్‌గా లోదుస్తులు ఎండలో ఆరవేసే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే.. అభివృద్ధిలో, ఆలోచనా విధానంలో భారతీయ సమాజం ఎంత వెనకబడిపోయిందో అర్థమవుతుంది. పురుషుల బనియన్లు, కట్ డ్రాయర్లను ఆరుబయట దర్జాగా వేలాడదీయడాన్ని ఒక అడ్వెంచరస్ ఫీట్‌లాగా ఫీలయ్యే జనాలు.. మహిళలు ఆరేసిన బ్రాస్, లోదుస్తులపై అపచార చూపులతో వంకర అభిప్రాయాలు ఏర్పరచుకునే స్థితి మారడం లేదు. అందుకే ఒంటిమీద చీర చాటున ఉండే ‘బ్రా’.. ఆరేసినా కూడా అదే చీర చాటున దాక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూరల్ లేదా అర్బన్, ఆడ లేదా మగ.. పర్టిక్యులర్ మెంటాలిటీస్ దీనికి కారణమా? అనే విషయం పక్కన బెడితే.. సమకాలీన చిత్రాలు, న్యూ ఎరా మూవీస్‌లోనూ మసకబారిన మనస్థత్వాలనే ఆవిష్కరిస్తూ, మానసిక వైకల్యాన్ని ప్రదర్శిస్తుంటే ఇంకా గ్రౌండ్ లెవెల్ పరిస్థితేంటి?
బ్రా, లోదుస్తులు మహిళలు ధరించే దుస్తుల్లో ఓ భాగమే తప్ప.. వాటిని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. కానీ వినోదాన్ని అందించే సినిమాల్లోనూ వాటిని ప్రత్యేక వస్త్రాలుగా, ఆత్మాభిమానానికి ప్రతీకగా చూపడం సొసైటీలో నెలకొన్న ప్రాచీన భావనలను బలపరిచేలా ఉంటున్నాయి. పేర్లతో సంబంధం లేకుండా ఒక బాలీవుడ్ క్లాసిక్ మూవీలో హీరోయిన్ సూట్‌కేస్ నుంచి పొరపాటున పడిపోయిన ‘బ్రా’ను స్టార్ హీరో భయంగా, ఇబ్బందికర ఫీలింగ్స్‌తో తీసుకుంటాడు. ఇక క్వీన్(2013) చిత్రంలో.. ఒక పార్టీ కోసం బయలుదేరే ముందు లిసా హేడన్ తన టాప్ కింద నుంచి బ్రాను తీసివేసే సన్నివేశం ఉంటుంది. ఇవి రాండమ్‌గా తీసుకున్న ఉదాహరణలే కాగా.. రీజినల్ మూవీస్ కూడా ఇవే రకమైన సీన్లతో లోదుస్తులను నెగెటివ్‌గా ప్రొట్రెయిట్ చేస్తున్నాయి.
అండర్ వేర్ షేమింగ్
ఇంత అడ్వాన్స్‌డ్ కల్చర్‌కు అలవాటు పడుతున్నా.. మహిళల బ్రాస్, అండర్‌గార్మెంట్స్ గురించి ఇబ్బంది పడాల్సిన పరిస్థితే ఉంది. ఈ దుస్తులను బహిరంగంగా ఆరేయలేరు. అంతెందుకు నేటికీ చాలా కుటుంబాల్లో మహిళలు.. పురుషులకు కనబడేట్లుగా ఆరుబయట లోదుస్తులను ఆరవేసే ధైర్యం చేయరు. ఒకవేళ అలా చేస్తే.. తప్పనిసరిగా ఇతర దుస్తులు, దుపట్టా లేదా చీర కింద ఆరేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరింత హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే.. మహిళలు బహిరంగంగా లేదా వారి ఇళ్లలో కూడా ‘బ్రా’ అనే పదాన్ని అందరి ముందు ఉచ్చరించలేరు. ఒకవేళ చెప్పాల్సి వస్తే.. లో వాయిస్‌లో చెప్తుంటారు.
ఈ విషయంపై సొంతం అనుభవాలను వెల్లడించిన ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సల్మా రెహమాన్.. చాలాసార్లు తన లోదుస్తులను ఇతర బట్టల కింద దాచి ఉంచినట్లు తెలిపింది. డెహ్రాడూన్‌లోని తన సొంత గ్రామంలో ఇప్పటికీ ఇదే పద్ధతి కొనసాగుతోందని చెప్పింది. ఇక తల్లిదండ్రులకు దూరంగా నివసిస్తున్న ఐటీ ప్రొఫెషనల్ మాణికా పరాషెర్.. ప్రస్తుతం తన లోదుస్తులను బయట ఎండలో ఆరేస్తున్నానని, కానీ అమ్మానాన్న దగ్గర ఉన్నప్పుడు వాటిని బహిరంగంగా వేలాడదీయడం మంచిది కాదని చాలాసార్లు విన్నానని తెలిపింది. ఒకరకంగా ఇది అభ్యంతరకర విషయమేనన్న మాణికా.. కొందరు లోదుస్తులను కూడా లైంగిక కోణంలో చూస్తూ అసభ్యంగా భావిస్తారని, నిజంగా ఇది ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
ఇంట్లో మెన్.. మాల్స్‌లో ఉమెన్?
పురుషుల విషయానికొస్తే.. వారి ట్రంక్స్, బ్రీఫ్స్ దర్జాగా ఆరుబయట హ్యాంగర్లకు వేలాడదీస్తారు. దాన్ని పురుషాధిక్యతకు ప్రతీకగా భావించే పురుష పుంగవులూ లేకపోలేదు. అయితే ఎటువంటి కారణం లేనప్పటికీ ఈ అనధికార నిషేధం మహిళలకే పరిమితమైంది. ఇంకాస్త విచిత్రమైన విషయం ఏంటంటే.. ఆధునిక సొసైటీలో లోదుస్తులు ధరించిన మహిళల బొమ్మలను షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో ఎంట్రెన్స్ డిస్‌ప్లే్లో దర్జాగా ఏర్పాటుచేస్తుండగా.. కొంతమంది యువతులు తమ సొంత ఇళ్లలోనే లోదుస్తులపై అనధికార నిషేధాన్ని ఎదుర్కోవడం ఆలోచించాల్సిందే.
లైంగిక కోణంలోనే..
లోదుస్తులను బహిరంగంగా ఆరేయడం వల్ల ఇబ్బంది ఏంటనే ప్రశ్నలు మోడ్రన్ సొసైటీలో వ్యక్తమవుతున్న మాట నిజమే. అయితే దీనివల్ల బయటికి కనిపించని ప్రమాదం ఉందనే వాదనలు లేకపోలేదు. నిజానికి సమాజం భిన్న మనస్థత్వాలు గల వ్యక్తుల కలయిక. మంచి ఎడ్యుకేషన్, విలువలతో పాటు ఉమెన్ ఫ్రీడమ్ గురించి అవగాహన కలిగిన వ్యక్తులకు ఇది సాధారణ విషయంగానే కనిపిస్తుంది. కానీ స్త్రీని సెక్స్ కోణంలోనే చూసే మానసిక వైకల్యుల విషయంలో ఇది అనూహ్య పరిణామాలకు దారితీయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సినిమాల్లో చూపించినట్లు.. ఇంటి బయట ఆరేసిన ఆడవారి లోదుస్తులను దొంగిలించి, ఫాంటసీలో తేలిపోయేవారూ ఉండొచ్చు. ఇది శ్రుతిమించితే లైంగిక దాడులకూ కారణం కావచ్చు. అంతేకాదు ఎవరైనా మహిళ చుట్టుపక్కల పురుషులను పట్టించుకోకుండా బహిరంగంగా లోదుస్తులు ఆరేసినా లేదా ఒంటిపై ఉన్నప్పుడు కనిపించినా.. సదరు మహిళ నుంచి సెక్స్‌కు ఆహ్వానం అందిందని భావించే మెన్ మెంటాలిటీస్ కూడా సొసైటీలో భాగమే.