- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ట్విట్టర్‌లో..#DeleteFacebook ట్రెండింగ్
దిశ, ఫీచర్స్: టెక్ దిగ్గజం ఫేస్‌బుక్.. ఆస్ట్రేలియాలోని తన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం నుంచి వార్తా విషయాలను బ్లాక్ చేస్తున్నట్లు వెల్లడించడంతో పాటు, ఆ దేశవాసులు ఫేస్‌బుక్‌లో వార్తలను చదివే అవకాశాన్ని నిలిపేసినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వార్తలు పంచుకొన్నందుకు గాను ఆయా సంస్థలకు ఫేస్‌బుక్ కొంత మేర ఫీజు చెల్లించాలనే నిబంధనను తెచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం..ఈ మేరకు ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టగా, అక్కడ వార్తా సేవలను ఎఫ్‌బీ నిలిపివేసింది. ఈ నిర్ణయం కారణంగా ఎఫ్‌బీ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ చర్యను వ్యతిరేకిస్తున్న చాలా మంది వినియోగదారులు తమ ట్వీట్లతో డిలీట్ ఫేస్‌బుక్ (#DeleteFacebook) హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.
టెక్ దిగ్గజం ఎఫ్‌బీ..ఆస్ట్రేలియాలో వార్తా కథనాలను నిషేధించిన తర్వాత ఆ దేశ ప్రజలు తమ ఫేస్‌బుక్ ఖాతాలను కూడా తొలగించాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎఫ్‌బీ చర్యను న్యూస్ ప్రొడ్యూసర్స్, రాజకీయ నాయకులు, మానవ హక్కుల న్యాయవాదులు విమర్శించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని గూగుల్ ముందు వ్యతిరేకించినా, తర్వాత న్యూస్ ఏజెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఫేస్‌బుక్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా, వార్త సేవలను నిలిపివేసింది. దీంతో ఎఫ్‌బీ చర్యపై వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు స్పందించడంతో డిలీట్ ఫేస్‌బుక్ (#DeleteFacebook) అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాటు, ఫేస్‌బుక్ వీ నీడ్ టూ టాక్ (#FacebookWeNeedToTalk), బాయ్‌కాట్ జుకర్‌బర్గ్ (#BoycottZuckerberg), బాయ్‌కట్ ఫేస్‌బుక్(#BoycottFacebook) హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ క్రమంలో ఫేస్‌బుక్ ఎలా డిలీట్ చేయాలో వివరిస్తున్నారు. అంతేకాదు, అకౌంట్‌ను డీయాక్టివేట్ చేస్తే..అది తాత్కాలిక చర్య అని, అలా కాకుండా శాశ్వతంగా ఎఫ్‌బీ నుంచి వైదొలగాలంటే.. దాన్నిడిలీట్ చేయాలని సూచించారు. దానివల్ల భవిష్యత్తులో మళ్లీ సోషల్ నెట్‌వర్క్‌కు సైన్ అప్ చేయాలనుకుంటే, ఏదైనా కంటెంట్ లేదా సమాచారాన్ని తిరిగి పొందలేరని తెలిపారు.
ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ కూడా ఎఫ్‌బీకి చెందినవే కాగా, ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రజలే కాకుండా, ఇతర దేశాల ప్రజలు కూడా డిలీట్ ఫేస్‌బుక్ ట్రెండ్‌లో భాగమవుతున్నారు. మరి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను డిలీట్ చేస్తారా? లేదా? అన్నది ఎంతోమందిలో ఉదయిస్తున్న ప్రశ్న.