ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేసిన తెలుగమ్మాయిది ఏ ఊరంటే

by Anukaran |
ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేసిన తెలుగమ్మాయిది ఏ ఊరంటే
X

దిశ,వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై దేశ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షపదవీ కాలం 11 రోజులే ఉన్నా ఆయన ప్రవర్తిస్తున్న తీరు అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. అందుకు కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడమే. ఆ ఓటమిని హుందాగా ఒప్పుకోని ట్రంప్ దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్ట్ లో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఓ వైపు ఆకేసులు కోర్ట్‌లో వీగిపోతుంటే.. జోబైడెన్ విజయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ అమెరికాన్ కాంగ్రెస్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ట్రంప్ ట్విట్టర్ అకౌంట్లు శాశ్వతంగా నిషేదానికి గురయ్యాయి. అయితే ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ నిషేదంతో పాటు ఆయన ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు తెలుగు రాష్ట్రాలకు చెందిన విజయ గద్దె అనే తెలుగు మహిళ. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను శాశ్వతంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో తెగ ట్రెండవుతున్నారు. మరి ఇంతకీ ఆ తెలుగమ్మాయి ఎవరు..? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నికల్లో పరోక్ష ఓటమితో పాటు ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ వెనుక ఉన్న ఈ తెలుగమ్మాయికి ఉన్న సంబంధం ఏంటని తెగ చర్చించుకుంటున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను అమెరికన్ కాంగ్రెస్ క్యాపిటల్ భవనంలో సమావేశమైంది. అదే సమయంలో జోబైడెన్ ఎంపికను అంగీకరించని ట్రంప్ మద్దుతు దారులు క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు బాధితులు మరణించారు. ఈ దాడులకు ముందు ట్రంప్ తన మద్దతు దారుల్ని రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు ఊతం ఇచ్చేలా.., క్యాపిటల్ బిల్డింగ్ లోకి చొరబడి అల్లర్లు సృష్టించిన వాళ్లు చాలా స్పెషల్, గొప్పదేశ భక్తులు అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ట్విట్లపై ట్విట్టర్ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ హింసను ప్రేరేపిస్తున్నాయని, అందుకే ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను శాశ్వంతంగా నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ సంస్థ ప్రకటించింది. ట్విట్టర్ ప్రకటన వెనుక తెలుగమ్మాయి విజయ గద్దె ఉన్నారు.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడికే ట్విట్టర్ షాకివ్వడం చర్చనీయాంశమైంది. అయితే ట్విట్టర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వెనుక ఆ సంస్థ లీగల్ హెడ్, భారత సంతతికి చెందిన విజయ గద్దె కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్‌లో జన్మించిన విజయ కుటుంబం ఆమెకు మూడేళ్ల వయసున్నప్పుడు అమెరికాకు వలస వెళ్లారు. కార్నెల్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన విజయ గద్దె .. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ను అందుకున్నారు. ప్రస్తుతం ఆమె ట్విట్టర్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్ కు చెక్ పెట్టే బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. 350 మంది పనిచేసే ట్విట్టర్ లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. 2011లో ట్విట్టర్‌లో చేరిన విజయ ట్విట్టర్ విజయంలో కీలక పాత్రపోషిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ శాశ్వత నిషేదం వెనుక విజయ గద్దె కీరోల్ ప్లే చేశారు. అంతేకాదు గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పొలిటికల్ యాడ్స్ అమ్మకూడదనే పాలసీని అందుబాటులోకి తెచ్చేలా ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీని ఒప్పించి.., ట్రంప్ పరోక్ష ఓటమికి విజయ గద్దె కారణమయ్యారు. అదెలా అంటారా..?

కరోనా కారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం అంతా సోషల్ మీడియా ద్వారానే జరిగింది. ఇండియాలో ట్విట్టర్ వినియోగం తక్కువే అయినా అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో ట్విట్టర్ కీరోల్ ప్లే చేస్తోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయాల్లో ట్విట్టర్ అకౌంట్ల ద్వారా ప్రజల్ని ఆకట్టునేలా కంటెంట్ ను షేర్ చేస్తుంటారు. ఆ కంటెంట్ ఆధారంగా విజయం వరిస్తుంది. అలాంటిది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ట్విట్టర్ ద్వారా పోలిటికల్ యాడ్స్ డిస్ ప్లే చేయడంపై బ్యాన్ విధించడంతో ట్రంప్ ఓటమికి విజయ గద్దె పరోక్షంగా కారణమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed