- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో..?
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్- హైదరాబాద్- రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు అధికారికంగా ప్రకటించకపోయినా స్పష్టత ఇవ్వగా, అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటికీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధిష్ఠానం ఇతర ఎన్నికలు జరుగుతున్న స్థానాలపై ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులతో చర్చలు జరుపుతూ అభ్యర్థి ఎంపిక విషయంలో అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కానీ హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం నిర్ణయానికి రాలేకపోతోంది. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు అడపాదడపా వారి నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని గెలిపించుకోవాలని ప్రచారం చేస్తున్నా, అభ్యర్థి విషయం మాత్రం ప్రస్తావించడం లేదు.
ఎందుకు ఈ తాత్సారం
అధికార పార్టీకి ఎమ్మెల్సీ స్థానం ఇప్పటివరకు కలిసి రాలేదు. పార్టీ అభ్యర్థులు గెలవలేదు. మంచి పలుకుబడి, ఉద్యమ నేపథ్యం ఉన్న అభ్యర్థుల నిలబెట్టిన ప్రయోజనం లేకపోయింది. దీనితో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో అభ్యర్థుల ఎంపిక కోసం అధిష్ఠానం అన్వేషణలో ఉన్నట్లు సమాచారం. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, సెట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి వంటి ఉద్దండులు బరిలో ఉండడంతో వారికి దీటైన అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్టు సమాచారం.
ప్రచారంలో ఉన్న పేర్లు
అధికార పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇప్పటివరకు ఒక నిర్ణయానికి రాకపోయినా పలువురి పేర్లు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వర్కటం జగన్నాథ్ రెడ్డి వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కుమారుడు జీవన్ రెడ్డి పేరు తెరపైకి వస్తోంది.
కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి డాక్టర్ చిన్నారెడ్డి పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుంచి చిన్నారెడ్డితోపాటు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి తదితరులు పోటీ పడ్డారు. అధిష్ఠానం చిన్నారెడ్డి పేరునే ఖరారు చేసినట్లు, ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. బీజేపీ నుంచి సెట్టింగ్ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు, వామపక్షాల అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యాయి. కాగా, కాంగ్రెస్ నుంచి ఆశతో ఉన్న పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉండాలని భావిస్తున్నారు. ఈ మేరకు ముమ్మరంగా ప్రచార కూడా నిర్వహిస్తున్నాడు.