- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఢీ అంటే ఢీ అంటున్న మహిళా నేతలు.. ఆ పదవి దక్కేదెవరికి..?
దిశ, మహబూబాబాద్: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం కనబరుస్తుంది. నాయకుల్లో కార్యకర్తలో నయా జోష్ వెల్లివిరుస్తుంది. ఇక పార్టీలో వర్గ పోరులు ఉండవని ప్రకటిస్తున్న రేవంత్ రెడ్డి ప్రకటనతో హమ్మయ్య అనుకుంటూ కాంగ్రెస్ క్యాడర్ సంబురాలు జరుపుకుంది. కానీ మానుకోట కాంగ్రెస్ లో మాత్రం ఇంకా వర్గపోరు కొనసాగుతూనే ఉందన్న విమర్శలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలి పదవీ కోసం ఇద్దరి మహిళ నేతలు నేనంటే నేనని ప్రకటించుకోవడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన మాలతి రెడ్డి పేరును జిల్లా అధ్యక్షురాలిగా ప్రకటిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుండగా ఇదే జిల్లా అధ్యక్షురాలి పదవికి గూడూరు మండలానికి చెందిన నునావత్ రాధ అనే మహిళా కాంగ్రెస్ నాయకురాలికి, మానుకోట మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా ప్రకటిస్తూ టీపీసీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీత రావు నియామక పత్రాన్ని అందజేసింది. దీనితో ఆ ఇద్దరి మహిళ నేతల మధ్య వార్ స్టార్ట్ అయింది.
మాలతి రెడ్డికి ఏఐసీసీ నుండి అధ్యక్షురాలిగా ప్రకటిస్తూ లెటర్ రావడం, రాధకు రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు నియామక పత్రం అందజేయడంతో కింది స్థాయి కార్యకర్తలు, నాయకులు డైలమాలో పడ్డారు. ఇంతకి ఎవ్వరు మహిళ జిల్లా అధ్యక్షురాలని, పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా పేరుగాంచిన మానుకోట కాంగ్రెస్ లో వర్గపోరు రోజురోజుకూ ఎక్కువ చేస్తూ పార్టీ ని అప్రతిష్ట పాలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే ఆ ఇద్దరు మహిళ నేతలు నేనంటే నేనూ జిల్లా అధ్యక్షురాలని ఒక్కరికంటే ఒక్కరు మించి మీటింగ్ లు పెట్టుకుంటున్నారు. ఆ ఇద్దరి నేతలను వారి వర్గ శ్రేణులు దుష్మాలతో, గజ మాలలతో సన్మానించుకుంటున్నారు.
వీరి వెనుక ఉన్నది వీరేనా..?
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన అప్పటి నుండి మానుకోటలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు కిందిస్థాయి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న భరత్ చందర్ రెడ్డి ఒక వర్గం, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ మరో వర్గంగా ఏర్పడి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాలతిరెడ్డికి భరత్ చందర్రెడ్డి మద్దతు ప్రకటిస్తుండడం, రాధాకు మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ అండగా నిలిచి ఉండడం కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు కొనసాగుతుందన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది.
వేం ఇలాకాలో వర్గపోరు..
టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ఇలాకాలో మహిళా నేతల వర్గ పోరు రచ్చ లేపుతుంది. వేం నరేందర్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే పార్టీ క్యాడర్ వర్గాలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఆయనపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత నియోజకవర్గంలోనే పార్టీ గాడి తప్పుతుంటే పట్టించుకోకుండా, రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేస్తారని గ్రామ స్థాయి కార్యకర్తలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
రంగంలోకి దిగాల్సిందే..
జిల్లా మహిళ అధ్యక్షురాలి ఎన్నికలో బయటపడ్డ వర్గపోరుకు ఫుల్ స్టాఫ్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి లు రంగంలోకి దిగాల్సిందే. మహిళ జిల్లా అధ్యక్షురాలి ఎన్నికపై మరోసారి కార్యకర్తలకు క్లారిటీ ఇవ్వాల్సిందే.
ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్..
ఏఐసీసీ నిర్ణయానికి కట్టుబడి ప్రతి కార్యకర్త పని చేయాలి. రాష్ట్రంలో 16 జిల్లా లో నూతనంగా మహిళ అధ్యక్షులను నియమిస్తూ ఇటీవల ఏఐసీసీ నుండి పలువురి పేర్లు వెలువడ్డాయి. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా నన్ను ప్రకటించారు. కాబట్టి నేనే అధ్యక్షురాలిగా కొనసాగుతా. పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం పని చేస్తాను. పార్టీ అభివృద్ధికై పాటుపడి, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను చేస్తున్న మోసాలను ఎండగడుతాను. పేదల పక్షాన పోరాటాలు చేస్తాను – మాలతి రెడ్డి
టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు నన్ను నియమించింది..
తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలిగా నన్ను నియమిస్తూ నియామక పత్రాన్ని సైతం అందజేసింది. రాష్ట్ర అధ్యక్షురాలి ఆదేశాల మేరకు మానుకోట జిల్లా అధ్యక్షురాలిగా పని చేస్తాను. మానుకోటలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు మహిళ హక్కుల కోసం పోరాడుతాను– నునావత్ రాధ