- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హంతకుడు ఎవరు..?
ఒక హత్య.. ఎన్నో అనుమానాలు.
ఒక హత్య.. రెండు పార్టీల మధ్య వైరం.
ఒక హత్య.. పోలీసులకే అంతుచిక్కని సందేహాలు.
ఒక హత్య.. క్లూస్ టీంకు కూడా చిక్కని పకడ్బందీ ప్లాన్.
ఒక హత్య.. సీపీనే ఉరుకులు, పరుగులు పెట్టించిన వైనం. ఇంతకూ హత్యకు గురైంది ఎవరు..? డాగ్ స్క్వాడ్‌కు కూడా దొరకకుండా ఆమెను అంతమొందించింది ఎవరు..? ఘటన స్థలంలో సాక్ష్యాధారాలను చెరిపేసింది ఎవరు..? ఆ మహిళా హత్యకు.. రూ.20 లక్షలకు సంబంధం ఏంటి..? ఇలా ఎన్నో చిక్కుముడులతో ఉత్కంఠ రేపుతున్న మిస్టరీ మర్డర్ గురించి తెలుసుకోవాలంటే ‘దిశ’అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ కథనం చదవాల్సిందే..!
దిశ ప్రతినిధి, నిజామాబాద్: పుర్రె మమత. ఈ పేరు గత నెల రోజులుగా నిజామాబాద్ జిల్లా ప్రజల్లో, పోలీస్ వర్గాల్లో, రాజకీయ నాయకుల నోళ్లల్లో నానుతోంది. అక్టోబర్ 3న ఆమె హత్యకు గురైంది. అందరితో సౌమ్యంగా ఉండే ఆమె కుటుంబానికి శత్రులు ఎవరూ లేరు. కానీ పొలానికి వెళ్లిన ఆమెను దుండగులు దారుణ హత్య చేశారు. మర్డర్ జరిగి నెల రోజులు దాటినా పోలీసుల దర్యాప్తు నేటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ హత్యలో హంతకుడు మాస్టర్ ప్లాన్ ఉపయోగించాడా..? లేక పోలీసులే కేసును నీరుగార్చుతున్నారా..? అనే అనుమానాలు ప్రజల నుంచి వస్తున్నాయి. హతురాలి కుటుంబం పక్షాన రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు నిలవడంతో కేసు రాజకీయ రంగు పులుముకుంది.
ఇంతకీ ఏం జరిగింది..?
సిరికొండ మండలం న్యావనంది గ్రామానికి చెందిన పుర్రె మమత గ్రామ శివారులోని తన పొలం వద్దకు అక్టోబర్ 3న వెళ్లింది. రాత్రి అయినా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతా వెతికారు. అయినా ఆమె ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే ఆమె బురద గుంతలో పడి మృతి చెంది ఉంది. ఘటన స్థలాన్ని బట్టి ఆమెది.. హత్యగా పోలీసులు నిర్ధారించారు.
ఎన్నో అనుమానాలు..?
మమత మృతదేహం వద్దకు వెళ్లిన పోలీసులు.. హత్యకు సంబంధించిన క్లూస్ సేకరించకుండనే మృతదేహాన్ని తీసి పక్కకు పెట్టారని బంధువులు ఆరోపిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ను కూడా క్లూస్ మొత్తం చెదిరి పోయాక తీసుకువచ్చారని వాపోతున్నారు. మమతది కేవలం హత్య మాత్రమే కాదని.. ఆమెపై అత్యాచారం కూడా జరిగిందని, ఆమె పడి ఉన్న తీరు, ఘటన స్థలం ఆనవాళ్లు అలాగే ఉన్నాయని పేర్కొంటున్నారు. అదేరోజు గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడి అకౌంట్ నుంచి రూ.20 లక్షలు డ్రా అయ్యాయని.. ఆ డబ్బులతోనే హత్య కేసును నీరుగార్చుతున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అనుమానితుడు గతంలో ఓ కేసులో జైలుకు వెళ్లివచ్చాడని, నేర చరిత్ర ఉన్నఅతడే అత్యాచారం చేసి.. నిజం బయట పడుతుందని హత్య చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ రంగు పులుముకోవడంతో..
క్రమంగా మమత హత్య రాజకీయ రంగు పులుముకుంది. మమతను హత్య చేసిన నిందితులను పోలీస్ లు పట్టుకోవడం లేదని, వారిని కాపాడుతున్నారని న్యావనంది గ్రామస్థులు అక్టోబర్ 8న సిరికొండ పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. మమత హత్యలో అధికార పార్టీ నేత అనుచరుల హస్తం ఉందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆరోపణలు చేశారు. నిజామాబాద్ రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి మమత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేశారు. మమత హత్యపై సమగ్ర విచారణ జరుపాలని పోలీస్ శాఖను రెండు పార్టీల నేతలు ఒత్తిడిలు తెచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసు దర్యాప్తులో పురోగతి లేకపోవడంతో నేటికీ ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.
పోలీసులకు తలనొప్పిగా మారిన దర్యాప్తు
మమత హత్య కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిజామాబాద్ సీపీ కార్తీకేయ కేసు విచారణ బాధ్యతలను తీసుకుని ఏసీపీని విచారణ అధికారిగా నియమించారు. నిజామాబాద్ టాస్క్ పోర్స్ సీఐ, డిచ్ పల్లి, ధర్సల్లి సీఐలు, సిరికొండ ఎస్ఐలను టీంగా ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు చేసిన ఆరోపణలు ఆధారంగా విచారణ చేపట్టినా ఈ కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కేసు విచారణపై రోజురోజుకు రాజకీయ ఒత్తిడి పెరుగుతోంది. ఎంతో అత్యాధునిక టెక్నాలజీని కలిగి ఉన్న పోలీస్ శాఖకు మమత మర్డర్ కేసు తలనొప్పిగా మారింది. హత్య కేసులో ఎలాంటి క్లూ దొరకకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.