- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేయర్ పదవి ఎవరికి దక్కేనో.?
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత నగర రాజకీయాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఫిబ్రవరి పది తర్వాత ఏమవుతుంది? ఏ పార్టీకి చెందినవారు మేయర్ అవుతారు? ఎవరు డిప్యూటీ మేయర్ అవుతారు? అనే అంశాల మీద చర్చ జరుగుతోంది. మేయర్ గా గెలుపొందేందుకు టీఆర్ఎస్‌కు పెద్దగా చిక్కులు లేవు. కానీ, రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ప్రతీ సమావేశంలోనూ అధికార పక్షాన్ని నిలదీసే వైఖరి తీసుకుంటుందని భావిస్తున్నారు. చర్చలు, వాదోపవాదాలు, విమర్శలతో ఇబ్బందికరంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేనిఫెస్టోలో చేర్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం నుంచి భారీగా నిధులను సమీకరించుకోవాల్సి ఉంటుంది. కొత్త పాలకమండలి కొలువుదీరడానికి కొంతకాలం వేచి చూడక తప్పదు. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఫిబ్రవరి పది వరకు ఉంది. కొత్త కార్పొరేటర్లంతా ఆ ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, బీజేపీ మేయర్ పదవిపైన దృష్టి పెట్టాయి. టీఆర్ఎస్‌లో మునుపటి ఉత్సాహం లేదు. మేయర్ పదవిని వదులుకోడానికి సిద్ధంగా లేనప్పటికీ, ఈసారి పోటీ చేయడం లేదంటూ వ్యూహాత్మకంగా లీకులు ఇస్తోంది. బీజేపీ స్పందన ఎలా ఉంటుందోనని గమనిస్తోంది.
సమర్థుల వేట
టీఆర్ఎస్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నందున మేయర్ పదవి ఎవరికి ఇవ్వాలనేదానిపై పార్టీలో చర్చలు మొదలయ్యాయి. ఈసారి మహిళా అభ్యర్థికి దక్కుతున్నందున ఎవరు సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారనే అంశాలపై ఆలోచనలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. విద్యాధికులు, నగర సమస్యలను సులభంగా అర్థం చేసుకునేవారికే పదవులు ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. ఒకరిద్దరి పేర్లు బయటకు వచ్చినా, ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉన్నందున ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు. బలమైన ప్రతిపక్షం ఉన్న నేపథ్యంలో దీటైన అభ్యర్థినే ఎంపిక చేయాలనుకుంటున్నారు
హామీలు తీర్చేదులా?
గెలిస్తే ఏమేమో చేస్తామంటూ అన్ని పార్టీలూ హామీ ఇచ్చాయి. బీజేపీ కూడా అదే దారిలో నడిచింది. ఇప్పుడు మేయర్ పదవికి పోటీ పడితే ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. అధికార పార్టీ వేసే ఎత్తులో చిక్కుకుంటే పథకాలు అమలు చేయడానికి నిధుల కోపం తిప్పలు తప్పవనే భావిస్తోంది. ప్రభుత్వం నుంచి సహకారం ఉండదు కాబట్టి నిత్యం చిక్కులు తలెత్తుతాయన్నది ఆ పార్టీకి తెలియందేమీ కాదు. దీంతో మేయర్ పదవిని తీసుకుని ముళ్ల కిరీటాన్ని తగిలించుకునే బదులు పోటీ చేయకుండా ఉండడమే ఉత్తమం అనుకుంటోంది. అధికార పార్టీకే అవకాశం ఇచ్చి సందర్భం వచ్చినప్పుడల్లా నిలదీయవచ్చని, ప్రతిపక్షంగా సమర్ధవంతంగా పనిచేయవచ్చని ఆ పార్టీ రాష్ట్రస్థాయి నేత ఒకరు వ్యాఖ్యానించారు.
ఈసారి ముళ్ల కిరీటమే
మేయర్ ఏ పార్టీకి చెందినవారైనా, ప్రభుత్వం నుంచి మద్దతు ఉన్నా లేకున్నా ఐదేళ్లపాటు నడిపించడం కత్తిమీద సాములాంటిదే. మేనిఫెస్టోలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి భారీ స్థాయిలో నిధులను సమీకరించుకోవాలి. నగరంలోని సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించడానికి తగిన వ్యూహాన్ని అమలు చేయాలి. వరద బాధితులను గుర్తించడం, వారికి పది వేల రూపాయల సాయాన్ని అందించాలి. స్థానిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలి. మాస్టర్ ప్లాన్ రూపొందించుకోవాలి. విశ్వనగరంస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇలా అనేక సమస్యలు కొత్త మేయర్‌కు సవాళ్లుగా ఉండనున్నాయి. ఎక్కడ జాప్యం జరిగినా, పనులలో లోపం జరిగినా నిలదీయడానికి బలమైన ప్రతిపక్షం ఉంటుంది కాబట్టి ఆచితూచి అడుగేయడం అనివార్యమవుతోంది. అందుకే సమర్ధులైనవారికే మేయర్ పదవి కట్టబెట్టాలన్నది టీఆర్ఎస్ ఉద్దేశం.