- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వెరైటీ సాగు.. ‘అంగస్తంభన’ మూలికలను పండిస్తున్న రైతులు
దిశ, వెబ్‌డెస్క్ : రైతుల కష్టాలు వర్ణనాతీతం. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికి వచ్చేవరకు రైతులు కల్లలో వొత్తులేసుకొని చూస్తారు. కొన్ని సార్లు పంటలో పెట్టుబడి ఖర్చులు కూడా రావు. దీంతో రైతు ఎన్నో ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో రైతులను సమస్యల నుంచి బయటపడటానికి గుజరాత్‌లోని రైతులు కొత్త ఆలోచన చేశారు. దాంతో వారు అత్యధిక లాభాలు గడించి మిగితా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ రైతుల ఆలోచన ఏంటీ అనేగా మీ ఆలోచన.
ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంటల్లో ఔషధ మొక్కలు ఒకటి. అయితే ఈ పంటలను పండిస్తే మంచి దిగుబడి వస్తుంది అంటున్నారు గుజరాత్ రైతులు. అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న వైట్ మస్లీ అనే మూలిక పంటను గుజరాత్ లోని దాంగ్ జిల్లాలో రైతులు పండిస్తూ కాసులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 350 మంది రైతులు మూలిక పంట సాగు చేపట్టగా మొత్తం 40 ఎకరాల్లో ప్రస్తుతం పంట సాగవుతోంది.
మస్లీ పంట సాగు…
మస్లీ మూలికల పంటను సఫేద్ మస్లీ అని కూడా అంటారు. వర్షాకాలంలో అధిక దిగుబడి ఇచ్చే పంటల్లో ఇది ఒకటి. అయితే ఈ మూలీకలు అధిక బరువు తగ్గేందుకు, అంగ స్తంభన సమస్యలకు, డయాబెటిస్ అదుపులో ఉంచుకునేందుకు బాగా పనిచేస్తుంది. అందుకే ప్రభుత్వం ఆయుర్వేద మందులతో పాటు వైట్ మస్లీతో తయారుచేసిన మందులను కూడా ఆయుర్వేద ఆస్పత్రులకు పంపిణీ చేస్తోంది. అంతే కాకుండా ఇది మూలికలతో పాటు టానిక్ రూపంలో కూడా లభిస్తుంది. అందుకే దీనికి ప్రపంచ వ్యాప్తంగా మార్కేట్‌లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఈ పంటను పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టడంతో తక్కువ పెట్టుబడితోనే పంట చేతికొస్తుంది. దీంతో పంట కోసం రైతులు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. అయితే ఈ పంట వేయడానికి రైతులను ప్రోత్సహిస్తూ రైతులకు దాంగ్ ఫారెస్ట్ విభాగం విత్తనాలను అందిస్తోంది. ఈ పంట పండిన తర్వాత కూడా రైతులు ధాన్యం ఏ మార్కెట్‌లో అమ్మాలి అనే ఇబ్బందులు లేకుండా, మార్కెట్ల చుట్టూ తిరిగే పనిలే కుండా.. పంట చేతికి రాగానే స్థానిక షాపులతో పాటు స్థానిక ఫార్మా కంపెనీల ప్రతినిధులు రైతుల వద్దకే వచ్చి పంటను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం కేజీ వైట్ మస్లీ ధర రూ.1000 నుండి రూ.1500 ధర పలుకుతుండగా ప్రభుత్వ పథకాలను పొందడంతో సాగు ఖర్చు చాలా స్వల్పంగానే ఉంటుంది అంటున్నారు రైతులు. మరీ ఇంకెందుకు ఆలస్యం మూలికల పంటతో కాసులు పండించండి.