కరోనా ఫేక్ వార్తల కట్టడికి వాట్సాప్ పోరు

by Shyam |   ( Updated:2020-03-20 01:47:34.0  )
కరోనా ఫేక్ వార్తల కట్టడికి వాట్సాప్ పోరు
X

category : life style – tech

కరోనా వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతూ పోతుంది. అయితే.. దానికంటే ముందే ఆ వైరస్ కు సంబంధించిన వదంతులు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వార్తలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మరి ఇలాంటి ఫేక్ వార్తలను గుర్తించేందుకు సోషల్ మీడియా సైట్ ముందడుగు వేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘‘వైరస్ ఇన్ఫర్మేషన్ హబ్’’ ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం పోయెంటర్స్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన అంతర్జాతీయ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్వర్క్ కోసం మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించింది.

కరోనా వైరస్ కు సంబంధించి ఏ వార్త తెలిసినా.. అందరూ ఆ వార్తలో నిజముందో లేదో తెలుసుకోకుండా ఫార్వార్డ్ చేస్తున్నారు. అందరూ తమ స్నేహితులకు, బంధువులకు, సమాచారాన్ని చేరవేస్తున్నారు. వాట్సాప్ వినియోగం చాలా పెరిగింది. ఫేక్ వార్తలన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ ప్రజలకు భయాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఫేక్ వార్తల కట్టడి కోసం వాట్సాప్ ఐఎఫ్సీఎన్ సహాయం తీసుకుంటోంది.

వాట్సాప్ ఇన్ఫర్మేషన్ హబ్:

కరోనా వైరస్‌ను గుర్తించిన తొలిరోజు నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. కరోనా వైరస్ కట్టడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోనే ‘‘వైరస్ ఇన్ఫర్మేషన్ హబ్’’కు వాట్సాప్ శ్రీకారం చుట్టింది. ఈ హబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సిబ్బందికి, కమ్యూనిటీ లీడర్లకు, ప్రభుత్వాలకు, వ్యాపార సంస్థలకు కమ్యూనికేషన్‌కు సహకరించడంతోపాటు పలు సూచనలు ఇవ్వనుంది. కరోనా వైరస్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా నివారించేందుకు తోడ్పడుతుంది. వాట్సాప్‌ను భారత్లో 400 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు.

Tags : whats app, corona virus, fake news, false , information, forward, share

Advertisement

Next Story