- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాయుడు రిటైర్మెంట్‌ను ఆపింది ఆయనే..
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవడంతో మనస్థాపానికి గురైన టీమ్ ఇండియా క్రికెటర్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్న రాయుడిని.. ఆఖరి క్షణంలో తప్పింది అతడి స్థానంలో విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. ఈ ఎంపికపై బాధపడిన రాయుడు బీసీసీఐ సెలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టోర్నీ మధ్యలో శిఖర్ ధావన్ గాయపడ్డా.. రాయుడిని కాదని మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్‌ను ఇంగ్లాండ్ పంపారు.
దీంతో క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్లు రాయుడు ప్రకటించాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో విశ్వనాథన్ కాల్ చేసి ‘నీలో ఆట ఆడే సత్తా ఇంకా ఉంది. రిటైర్మెంట్ నిర్ణయంపై పునరాలోచించు. సీఎస్కేతో నీ అనుబంధం కొనసాగించు’ అని చెప్పారట. దీంతో రాయుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు జాతీయ మీడియాలో ఒక కథనం వెలువడింది. ఐపీఎల్ తాజా సీజన్ తొలి మ్యాచ్ ఆడిన రాయుడు చెన్నై గెలుపులో కీలకపాత్ర పోషించి తనలో సత్తా తగ్గలేదని నిరూపించుకున్నాడు.