- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బర్త్ డే స్పెషల్: రోహిత్ శర్మ తెలుగువాడని మీకు తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గురించి తెలియని క్రికెట్ ప్రేక్షకులుండరు. రోహిత్ బ్యాటింగ్‌కు దిగితే చూడాలని ప్రతి క్రికెట్ అభిమాని అనుకుంటాడు. రోహిత్ స్ట్రైల్ బ్యాటింగ్, షాట్స్‌ను ఇష్టపడనివారండరు. తన బ్యాటింగ్‌తో ఎంతోమంది అభిమానులను రోహిత్ సంపాదించుకున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ కూడా రోహిత్‌కు అభిమాని. రోహిత్ టీమ్‌లో లేకపోతే తాను క్రికెట్ మ్యాచ్ చూడనని, టీవీ ఆపేస్తానంటూ ఇటీవల సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఇవాళ రోహిత్ శర్మ తన జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. అయితే రోహిత్ శర్మ ఒకరకంగా మన తెలుగు వ్యక్తి అనే విషయం చాలామంది తెలియదు. రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ శర్మ సొంతూరు విశాఖపట్నం. రోహిత్ శర్మ బాల్యం కొన్నిరోజుల పాటు వైజాగ్‌లో సాగింది.
అంతేకాకుండా రోహిత్‌కు తెలుగు కూడా వచ్చు. తెలుగుని అర్థం చేసుకోగలడు. కానీ తెలుగులో సరిగ్గా మాట్లాడలేడు. దీంతో రోహిత్ శర్మను తెలుగు వాడిగా తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు భావిస్తారు. గతంలో ఐపీఎల్‌లో డెక్కన్ చార్జర్స్ తరపున రోహిత్ ఆడిన విషయం తెలిసిందే.