- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హ్యాపీనెస్ క్లాస్ అంటే ఏమిటి?
దిశ, వెబ్‌డెస్క్ :
వచ్చేవారం తమ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో హ్యాపీనెస్ క్లాస్‌కి హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను ఆహ్వానించలేదన్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ హ్యాపీనెస్ క్లాస్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
2018 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు ప్రకారం 155 దేశాల్లో భారత్ 133వ స్థానంలో నిలిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశంలోని అన్ని పాఠశాలల్లోని పిల్లల్లో మానసిక కౌశలం, భాష, సాహిత్యం, వేదగణితం, కళల మీద ఆసక్తి పెంచడంతో పాటు వారి శారీరక శుభ్రత, సంతోషాలను పెంపు చేసుకునే యాక్టివిటీలను చేయించాలని అనుకున్నారు. పిల్లలు సంతోషంగా ఉన్నపుడు వారికి చదివింది గుర్తుండటంతో పాటు పాఠాలు బాగా అర్థమవుతాయనే ఉద్దేశంతో హ్యాపీనెస్ క్లాస్ అనే కాన్సెప్ట్‌ను వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ క్లాస్‌లో నేర్చుకున్న అంశాల గురించి ఎలాంటి పరీక్షలు నిర్వహించి, మార్కులు ఇవ్వనప్పటికీ, ఈ పాఠాలు వారి జీవితాన్ని సుఖమయం చేయడంలో ఉపయోగపడతాయి.
ఈ ఉద్దేశంతోనే ఢిల్లీ పాఠశాలల్లో 2018లో హ్యాపీనెస్ క్లాస్‌ను కేజ్రీవాల్, సిసోడియా ప్రారంభించారు. ఇందులో నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులకు వివిధ అంశాల్లో వివిధ రకాలుగా శిక్షణిస్తారు. చిన్నపిల్లలకు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో క్లాసులు నిర్వహించగా, పెద్ద తరగతి వాళ్లకు వారిలో వారు చర్చించుకుని మానసిక ఉల్లాసం పొందేలా తరగతులు నిర్వహిస్తారు. వారానికి రెండు సార్లు 45 నిమిషాల పాటు ఈ తరగతులు జరుగుతాయి. ఈ క్లాసుల వల్ల పిల్లల ప్రవర్తనలో చాలా మార్పు కనపడుతోందని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. స్వయంగా ఆలోచించగలగడం, ఆందోళన, ఒత్తిడిని తట్టుకోగలగడం, సొంత ఆలోచనలతో ముందుకు సాగడం వంటి లక్షణాలను ఈ క్లాసు ద్వారా పొందే అవకాశం కలుగుతుంది.