- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ ఎందుకు?
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసే నిబంధనను మరికొద్ది నెలలు పొడిగించినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. వ్యాపారుల అభ్యర్థన మేరకు 15 జనవరి, 2021కు బదులు జూన్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. తొలుత దీనిని 2021 జనవరి 15 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని గతేడాది నవంబర్ నెలలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అసలు హాల్ మార్కింగ్ అంటే ఏమిటీ? దీని వల్ల ఏమిటి ఉపయోగం?
బంగారమంటే అందరికీ ఇష్టమే. మనం ఏవైనా వస్తువులు కొంటే.. బీఎస్‌ఐ(బ్యూరో స్టాండర్స్డ్ ఆఫ్ ఇండియా) మార్క్ ఉందో లేదో చెక్ చేసుకుంటాం. అలానే బంగారం కొనే ముందు.. హాల్‌మార్క్ గుర్తు చూసి కొనమంటారు. దానికి కారణమేంటంటే.. అది మేలిమి బంగారమో కాదో తెలుసుకోవడానికే హాల్‌మార్క్ ఉపయోగపడుతుంది. పాత కాలంలో ఇలాంటివేమీ లేవు. కేవలం బంగారం రంగుని బట్టి దాన్ని గుర్తించేవారు. సాధారణంగా బంగారంలో కొన్ని లోహాలను కలిపితే అది ముద్దగా అవుతుంది. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు.. కాపర్ వంటి వాటిని వినియోగించి నకిలీ బంగారాన్ని తయారు చేస్తూ.. వినియోగదారులను మోసం చేస్తుండేవారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛమైన పసిడికి గుర్తుగా.. ఈ హాల్‌మార్క్‌ను తీసుకొచ్చింది. ఈ గుర్తుంటే.. బంగారం స్వచ్ఛంగా ఉందని అర్థం. అలాగే ఈ హాల్‌మార్క్ గుర్తుతో పాటు బంగారం కొన్న దుకాణం పేరు, పసిడి క్యారెట్ల బరువు ఖచ్చితంగా ఉండాలని సూచించింది.
ఈ హాల్‌మార్క్ గుర్తును ఇచ్చేది బీఐఎస్. హాల్‌మార్క్‌లో క్యారెట్ బీఐఎస్ స్టాంప్, హాల్‌మార్కింగ్ సెంటర్ మార్క్, ఇయర్ ఆఫ్ హాల్ మార్కింగ్, జ్యువెలరీ ఐడింటిఫికేషన్ మార్క్, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వంటి డీటెయిల్స్ బంగారంపై ఉంటాయి. ఈ మార్క్ బంగారం స్వచ్ఛతను సూచిస్తుంది. హాల్‌మార్క్ నగలను విక్రయించే దుకాణాల పూర్తి జాబితాను మనం బీఎస్‌ఐ వెబ్‌సైట్‌లో కూడా చూడొచ్చు. ఒక వేళ మనకు బంగారు హాల్‌మార్క్ మీద ఫిర్యాదులు ఉంటే నేరుగా బీఎస్‌ఐను సంప్రదించవచ్చు.
బంగారం కొనుగోలు చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం.. దాని స్వచ్ఛత. బంగారం స్వచ్ఛతను రెండు రకాలుగా లెక్కిస్తారు. మొదటిది గోల్డ్ క్యారెట్, మరొకటి ఫైన్‌సెన్స్. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం మనం కొనుగోలు చేస్తున్న బంగారు ఆభరణాలు 22 క్యారెట్లవి. 24 క్యారెట్ల బంగారాన్ని కాయిన్స్, బార్‌ల రూపంలో కొనవచ్చు. గోల్డ్ కాయిన్ కొనాలంటే.. స్థానిక స్వర్ణకారుడినో లేదా షోరూమ్‌లోనో కొనుగోలు చేస్తుంటాం. చాలా బ్యాంకులు వేర్వేరు విలువల కలిగిన 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్లను విక్రయిస్తున్నాయి. మనం కొనేటప్పుడు మేకింగ్ చార్జెస్, ప్రాఫిట్ మార్జిన్, ట్యాక్స్, జీఎస్‌టీ చెల్లిస్తుంటాం. కానీ విక్రయించేటప్పుడు ఇవన్నీ వర్తించవనే విషయం గుర్తుంచుకోవాలి.
హాల్ మార్క్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. వినియోగదారుడిని కల్తీ బంగారం నుంచి కాపాడంతో పాటు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు మోసపోకుండా చూడటం. వీటి తయారీలో తయారీదారులు చట్టబద్ధమైన ప్రమాణాలను పాటించేలా చేయడం.