- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి..? దాని విలువ ఎంత..?
దిశ, వెబ్‌డెస్క్ : క్రిప్టోకరెన్సీ ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా ఉంది. ఇది మన కంటికి కనిపించదు. కానీ దీని విలువ మాత్రం అసాధారణం. ఈ మధ్య మన దేశంలో ప్రభుత్వం క్రిప్టోకరెన్సీపై నిషేధం తీసుకురావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కాని ఇన్వెస్టర్లు మాత్రం దీనిని ఇండియాలో అనుమతించాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే దేశంలో ఇన్వెస్టర్ల సంఖ్య 10.07 కోట్లుకు చేరింది. వారి పెట్టుబడి అంచనా రూ.40,000 కోట్లుగా ఉన్నది.
అసలు ఈ క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటో చూద్దాం
క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్ అనగా వర్చువల్. ఈ వర్చువల్ కరెన్సీ క్రిప్టోగ్రఫీ సూత్రంపై పనిచేసే బ్లాక్‌చైన్ టెక్నాలజీ నుండి తయారు చేసింది. సాధారణంగా ఏ దేశ కరెన్సీ ఆ దేశ కంట్రోల్‌లో ఉంటుంది. కాని క్రిప్టోకరెన్సీ ఎవరి నియంత్రణలో ఉండదు. ఇది అంతర్జాతీయ డిజిటల్ కరెన్సీ పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ. దీన్ని ఏ ప్రభుత్వం లేదా సంస్థ నియంత్రించలేవు. ఈ కారణంగా దానిలో అస్థిరత ఉంది.
రహస్య చెల్లింపులు, సంఘవిద్రోహ శక్తులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా ఒకరి నుంచి ఇంకొకరికి నేరుగా చెల్లింపులు చేసుకోవచ్చు. క్రిప్టోకరెన్సీలు విస్తృతంగా వాడుకలో ఉండడం వలన దీనిపై నియంత్రణ లేకుండా వదిలేస్తే, తీవ్రవాద నిధులు హవాలా లావాదేవీలకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. క్రిప్టో కరెన్సీలకు విలువ లేదనలేం. కాని దీని నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం తెలిపింది.
క్రిప్టోకరెన్సీలు ex..Bitcoin, Ethereum. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది బిట్ కాయిన్ పై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ ఇండియన్ కరెన్సీలో 43లక్షల వరకు ఉంది. ఇంతకు ముందు ఒక బిట్ కాయిన్ విలువ 56లక్షలుగా ఉండేది. ప్రభుత్వం క్రిప్టోకరెన్సీల పై నిషేధం తీసుకురావచ్చనే వార్తల నేపథ్యంలో బిట్ కాయిన్ విలువ అమాంతం తగ్గింది. విచిత్రం ఏమిటంటే బిట్ కాయిన్ ముక్క కూడా చూద్దామన్నా మనకు కనిపించదు.
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు 14,500. ఇవి 150 పైగా దేశాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్లు 30 కోట్లు కాగా, క్రిప్టోకరెన్సీల మొత్తం విలువ $2.5 ట్రిలియన్ పైగా ఉంది. వీటిలో బిట్‌కాయిన్ మార్కెట్ $1.1 ట్రిలియన్, ఎథేరియం $492 బిలియన్, బినాన్స్ కాయిన్ $94.3 బిలియన్. కాగా, క్రిప్టోకరెన్సీ 400 పైగా ఎక్చేంజిలలో ట్రేడింగ్ అవుతున్నాయి.