- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Prabhas: హై అలర్ట్ అంటూ ప్రభాస్ డైరెక్టర్ ట్వీట్.. ఈ టైమ్‌లో ఇలాంటి పోస్ట్ అవసరమా అంటూ దారుణ ట్రోల్స్

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas), మారుతి(Maruti) కాంబోలో ‘ది రాజాసాబ్’(The Rajasaab) సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. తెలుగు రొమాంటిక్ హారర్ చిత్రంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీని పీపుల్ మీడియా బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad), వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్, మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, యోగిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది షూటింగ్ మొదలైనప్పటికీ ‘ది రాజాసాబ్’ పలు సీన్లు చిత్రీకరణ మిగిలిపోవడంతో వాయిదా పడుతూ వస్తోంది.
ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. అయితే షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ‘ది రాజాసాబ్’ నుంచి పోస్టర్స్, గ్లింప్స్ తప్ప మరే అప్డేట్ విడుదల కాకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూవీ మేకర్స్ కొత్త విడుదల తేదీని కూడా ప్రకటించకపోవడంతో అంతా నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మారుతి ఓ ట్వీట్ చేసి ట్రోలింగ్‌కు గురవుతున్నారు. ట్విట్టర్ ద్వారా మారుతి ‘‘హై అలర్ట్.. మే మధ్య నుంచి వేడి తరంగాలు మరింత పెరుగుతాయి’’ అనే క్యాప్షన్ జత చేసి ఓ ఆటో వెనుక ప్రభాస్ పోస్టర్ అంటించి ఉన్న ఫొటోను పెట్టారు.
ఇక అది చూసిన నెటిజన్లు మేలో టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ వస్తుంది కావచ్చు అందుకే ఇలా పోస్ట్ పెట్టాడని అంటున్నారు. ఇక అప్డేట్ ఇచ్చిన సమయం కరెక్ట్ కాదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి కారణంగా యావత్ భారతదేశం బాధలో ఉండగా.. సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న మారుతి అదే రోజున ఇలాంటి ట్వీట్ చేయడం కరెక్ట్ కాదని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కాగా, ప్రభాస్ ఈ సినిమాతో పాటు పలు భారీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. తీరిక లేకుండా ఫుల్ బిజీగా ఉన్న ఆయన అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతున్నారు.
HIGH ALERT…‼️
— Director Maruthi (@DirectorMaruthi) April 23, 2025
HEAT WAVES gonna rise even higher from mid May! 🔥🔥🔥 pic.twitter.com/EdEdtMCq6E