- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Pahalgam attack: శ్రీనగర్‌కు ఖాళీగా వెళ్తున్న విమానం? పిక్ ఆఫ్ ది డే.. ఫోటో వైరల్

దిశ, డైనమిక్ బ్యూరో: (Jammu Kashmir)జమ్ముకశ్మీర్‌లోని (Pahalgam Terror attack) పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి (Tourists) పర్యటకులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఘటన తర్వాత కేవలం 6 గంటల వ్యవధిలోనే 3 వేల 300 మంది (Srinagar) శ్రీనగర్‌ను వీడినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు విమానాలు కూడా అందుబాటులో ఉంచారు. మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి శ్రీనగర్‌కు వెళ్లే వారి సంఖ్య పూర్తిగా తగ్గినట్లు తెలుస్తోంది. శ్రీనగర్‌కు ఇది టూరిస్ట్ సీజన్ అని, కానీ ఘటన నేపథ్యంలో టూరిస్టులు లేకుండా శ్రీనగర్‌కు వెళ్లే విమానాలు ఖాళీగా దర్శనమిస్తున్నట్లు తాజాగా నెట్టింట ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రయాణికులు లేక శ్రీనగర్‌కు వెళ్లే ఫ్లైట్స్ వెల వెలబోతున్నట్లు ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పిక్ ఆఫ్ ది డే అంటూ నెటిజన్లు ఫోటోలు షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం శ్రీనర్‌లో పరిస్థితులపై ఈ విమాన చిత్రం చూస్తే అవగాహన వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రోజుల వరకు ఇలాగే ఉంటుందని, తర్వాత ఎప్పటిలాగే శ్రీనగర్‌కు వెళ్లోచ్చని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. ఇక, ఉగ్రదాడి కారణంగా శ్రీనగర్ నుంచి వివిధ రాష్ట్రాల పర్యాటకులను సురక్షితంగా తీసుకొస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టు నుంచి 20 విమానాలు వెళ్లాయి.