- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చర్చల వైపు వెళ్తుంటే దాడులా...

దిశ, తుంగతుర్తి: ఒకవైపు శాంతి చర్చలపై ఆలోచిస్తూ కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మావోయిస్టులపై దాడులు, ఎన్ కౌంటర్ లకు కేంద్ర,రాష్ట్రాలు పూనుకోవడాన్ని ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ (సిపియుఎస్ఐ)పార్టీ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి.రమేష్ ఖండించారు. వెంటనే వీటన్నిటిని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రమేష్ గురువారం “దిశకు ఒక ప్రకటన పంపారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా కోసం ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం ప్రాతం కర్రే గుట్టను భారీగా కేంద్ర బలగాలు చుట్టు ముట్టడాన్ని తక్షణమే ఆపాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్య భారతదేశంలో ఉన్న 28 రకాల ఖనిజాలను వెలికితీయడం కోసం పర్యావరణ, అడవులను విధ్వసం చేస్తు ఆదివాసులను మారణకాండకు గురి చేస్తున్నారని ఆయన వివరించారు.
లక్షల ఎకరాల భూములలోని ఖనిజ సంపద వనరులను స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులు అతి చౌకగా కొత్తబెట్టే కుట్రలను ప్రజానీకం వ్యతిరేకించాలన్నారు. అదివాసులపై జరుగుతున్న మారణహోమాన్ని వ్యతిరేకిస్తు ఛతీస్ గడ్, బస్తర్అబుజ్ మాడ్, చర్ల, తదితర ప్రాంతాల్లో వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. అదివాసులు మా గూడెంలో-మా రాజ్యం, మా గూడెంలో-మా స్వయంపాలన అనే నినాదంతో స్వయం ప్రతిపాదిక ను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆదివాసీల భూములు, అడవులు, అటవి సంపద ఖనిజాలను కార్పోరేట్లకు కట్టబెట్టడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసులపై కేంద్ర ప్రభుత్వం మోడీ-షాలు కగార్ పేరుతో కొనసాగుతున్న అప్రకటిత యుద్ధం ఆపాలని రమేష్ డిమాండ్ చేశారు.