గర్భిణీలు గుమ్మడికాయ తింటే ఏమవుతుంది..?

by sudharani |   ( Updated:2022-04-19 06:43:32.0  )
గర్భిణీలు గుమ్మడికాయ తింటే ఏమవుతుంది..?
X

దిశ, వెబ్‌డెస్క్ : గుమ్మడికాయతో ఎన్నో రకాల వంటలు చేస్తారని తెలిసిందే. ముఖ్యంగా గుమ్మడికాయ వడియాలు చాలా ఫేమస్. వెజ్ ప్రియులు గుమ్మడికాయతో నోరూరించే వంటకాలు చేసుకోని ఆరగిస్తూ ఉంటారు. అయితే గర్భిణీలు ఈ గుమ్మడి కాయ వంటకాలు తినొచ్చా.. లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. గుమ్మడికాయ పోషకాల గని. ఇందులో ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఇనుము, కాల్షియం, నియాసిన్, భాస్వరం ఇలా ఎన్నో మేలు చేసే ప్రోటీన్లు దీని సొంతం. అయితే దీనిని ఎవరు తినాలి.. ఎవరు తినకూడదో తెలుసుకుందాం..

ఒక్క గుమ్మడి కాయ తింటే..

గర్భిణీలు గుమ్మడికాయను, దానిలోని గింజలను తినవచ్చు. దీనిని గర్భిణీలు ఉడికించుకోని మితంగా తింటే ఉదర తిమ్మిరి తగ్గుతుంది. అలాగే దీనిలోని పోషకాలు తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. పేగుల్లోని పురుగులను తొలగించి కడుపును శుభ్రపరుస్తుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. గుమ్మడికాయ తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. దీనిలో ఉంటే ప్రోటీన్, పైబర్ జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది. దీనివల్ల మలబద్దకం దరిచేరదు.

గింజలూ ఉపయోగమే..

గుమ్మడి గింజలను తినడం వల్ల శరీరానికి కావల్సినంత మెగ్నీషియం లభిస్తుంది. దీని వల్ల గుండె పని తీరు స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. ఈ గింజల్లో జింక్ అధికంగా ఉండడం వల్ల గర్భిణీలకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్సలిన్ అధికంగా ఉత్పత్తి అయ్యి డయాబెటిస్ స్థాయిని నియంత్రిస్తుంది. గర్భిణీలను నిద్ర లేమికి దూరం చేస్తుంది. గుమ్మడి గింజల నుంచి విడుదలైన అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్.. స్లీప్ హీర్మోన్ అయిన మెలటోనిన్ గా మారుతుంది. దీని వల్ల అధిక నిద్రకు ఆస్కారం ఉంటుంది. తలనొప్పి, రక్తపోటు, కీళ్ల నొప్పులు, రుతుస్రావ సమస్యలను దూరం చేస్తుంది. కడుపులోని పిండం, మెదడు అభివృద్ధికి గింజల్లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉపయోగపడుతాయి.

ఎంత మంచో.. అంతే చెడు..

గుమ్మడి కాయ అందరిపై ఒకేలా పని చేయదు. కొంతమందికి చేటు కూడా చేస్తుంది. గమ్మడి విత్తనాలు అధిక స్థాయిలో హార్మోన్లు విడుదల చేస్తాయి. ఇది గర్భిణీలకు అలెర్జీ కలిగిస్తాయి. దీనిని మితంగా తీసుకుంటేనే మేలు. అధికంగా తీసుకుంటే విరోచనాలు కావడంతోపాటు కడుపు, తలనొప్పి వచ్చే అవకాశం ఉన్నది.

ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్..

Advertisement

Next Story

Most Viewed