నయీమ్ కేసు దర్యాప్తు ఏమైంది

by Shyam |
Naeem case
X

దిశ,తెలంగాణ బ్యూరో : గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయినా ఆ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయలేదని ఏఐసీసీ అధికారి ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నయీమ్ బ్లూ డైరీపై, స్వాధీనం చేసుకున్న వేల ఎకరాల భూములపై, కోట్లరూపాయల పై సిట్ జరిపిన దర్యాప్తు వివరాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఆరోపణలు ఉన్న వారిపై సిట్‌ కేసులు ఎందుకు నమోదు చేయలేదో తెలపాలన్నారు.

ఐదేళ్లుగా చార్జిషీటు ఎందుకు నమోదు చేయలేదని, ఇప్పటి వరకు ఎంత మంది బాధితులకు న్యాయం చేశారో తెలపాలని ఆయన కోరారు. సీబీఐ ఎంక్వైరీ చేయాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోపోవడానికి కారణం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో చేతులు కలపినందుకేనా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed