- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యక్తిత్వ లక్షణాలు వెల్లడించే ‘వేలిముద్ర’.. మీరు ఏ రకానికి చెందిన వారో తెలుసుకోండి
దిశ, ఫీచర్స్ : వేలిముద్రలు ప్రభుత్వం అందించే గుర్తింపు కార్డుకు సంబంధించినవి మాత్రమే కాదు. అవి వ్యక్తిత్వం గురించి కూడా చాలా విషయాలు వెల్లడిస్తాయి. వేళ్లపై ఉన్న గీతల ఆకారం ఆధారంగా ఆయా వ్యక్తుల లక్షణాలు, ప్రతిభ గురించి డెర్మటోగ్లిఫిక్స్(వేలిముద్రలు, గీతలు, మౌంట్స్, చేతులపై ఆకారాల శాస్త్రీయ అధ్యయనం) ఎక్స్‌పర్ట్స్ కొన్ని విషయాలు తెలిపగా.. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని విశ్వసించారు. ఈ సంగతి పక్కన పెడితే.. తమ వ్యక్తిత్వం గురించి వేలిముద్ర ఏం చెబుతుందో తెలుసుకోవడానికి మాత్రం ఎంతోమంది ఆసక్తి చూపిస్తారని డెర్మటోగ్లిఫిక్స్ నిపుణులు చెబుతున్నారు.
ఫింగర్ ప్రింట్స్ మన గుర్తింపునకు ప్రతీకగా నిలుస్తాయి. ఈ భూమిపై ఏ ఇద్దరి వేలిముద్రలు ఒకేలా ఉండవు. అందుకే నేరస్తులను పట్టుకోవడంలో వేలిముద్రలు కీలకంగా మారతాయి. ఒకే చేతికుండే ఐదువేళ్ల ముద్రలు కూడా వేటికవే భిన్నంగానే ఉంటాయి. జన్యుపరమైన నిర్మాణాన్ని అనుసరించి వేళ్ల పైనుండే గీతలు రూపొందగా, ఈ రిడ్జ్ ప్యాటర్న్ మార్పునకు డీఎస్‌ఏ మాత్రమే కారణం కాదు. గర్భంలోని భిన్న వాతావరణ కారకాలు కూడా వీటి నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే శరీరం ఎలా అభివృద్ధి చెందుతుందనే దానిపై మన పాత్ర కూడా ప్రభావం చూపుతుంది. వేర్వేరు ఉద్దీపనలు వేర్వేరు ఫలితాలకు దారితీస్తాయి. అదేవిధంగా ప్రత్యేకమైన బొటన వేలిముద్ర మన పాత్ర గురించి కీలకమైన గుణాన్ని బహిర్గతం చేయవచ్చు.
టెంట్ :
ఈ వేలిముద్ర నమూనా ఉన్న వ్యక్తులు సాధారణంగా గందరగోళంగా, మూడీగా ఉంటారు. ఒక క్షణం వెచ్చదనాన్ని కోరుకుంటే, ఆ మరుసటి క్షణమే చల్లదనాన్ని ఇష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అకస్మాత్తుగా, అనాలోచితంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు కూడా అలానే ఉంటాయి. సృజనాత్మకంగా ఉంటూ సవాళ్లకు భయపడరు.
రేడియల్ :
వేలిముద్ర రేడియల్ రూపంలో ఉంటే సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అని అర్థం. ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరి మీద డిపెండ్ అయ్యే రకం కాదు. తెలివైనవారే కాక ప్రశ్నించేతత్వంతో పాటు విమర్శించే గుణం కూడా ఉంటుంది. వ్యక్తిగత స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తారు.
నూస్ :
వేలిముద్ర ఒక పాములా కనిపిస్తే సున్నితమైన వ్యక్తులు. చాలా పాసివ్(నాట్ యాక్టివ్)గా ఉంటారు. అన్నింటినీ గమనిస్తూ ఉంటారు కానీ గుంపులో గోవిందంలా ప్రవాహంతో వెళ్లడానికే మొగ్గు చూపుతారు.
పికాక్ ఐ :
వేలిముద్ర నెమలి కన్నులా ఉంటే అద్భుతమైన లీడర్‌షిప్ స్కిల్స్ కలిగి ఉండటంతో పాటు కళాత్మకంగా ఉంటారు. అన్ని విషయాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు.
కొల్లాజ్ :
వేలిముద్ర అనేక రకాల లూప్ కొల్లాజ్‌లా ఉంటే వ్యక్తులను సులభంగా కించపరిచే లక్షణాన్ని కలిగి ఉంటారు. వ్యక్తీకరించే విధానం సున్నితంగా, మధురంగా ఉండదు.
సెమీ యింగ్-యాంగ్(Semi ying-yang)
అసంపూర్ణమైన యింగ్-యాంగ్ లేదా ఇంప్లోడింగ్ వోర్ల్ లాగా కనిపిస్తే, ఆ వ్యక్తికి అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనేందుకు ఇదే సూచిక. పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కో-ఆర్డినేషన్ స్కిల్స్ విశేషంగా ఉంటాయి. కాకపోతే తక్కువ ఏకాగ్రతను కలిగి ఉండటం వీరి ప్రతికూలత.
స్పైరైల్ :
ఫింగర్ ప్రింట్ స్పైరెల్‌లా ఉంటే, ఆ వ్యక్తి స్వీయ ప్రేరణ(సెల్ఫ్ మోటివేటెడ్)తో ఉంటాడని అర్థం. వీరు సొంత గుర్తింపును కలిగిఉండేందుకు ఇష్టపడతారు. సముచిత స్థానాన్ని వెతకడానికి ప్రయత్నిస్తుంటారు.
కాన్‌సెంట్రిక్ :
వేలిముద్రలో కేంద్రీకృత వలయాలను చూసినట్లయితే, చాలావరకు సెల్ఫ్ లవింగ్ పర్సన్‌గా చెప్పొచ్చు. వేలిముద్రలో సాధారణ కేంద్రంతో కొన్ని సర్కిల్స్ కలిగి ఉన్న వ్యక్తి, ఒకరి నియంత్రణలో ఉండటాన్ని ఇష్టపడరు. సాధారణంగా సొంత లక్ష్యాలను సెట్ చేసుకుంటారు.
సింపుల్ ఆర్చ్ :
ఒక సాధారణ వంపు వేలిముద్ర ఉన్న వ్యక్తులు.. అంకితభావం, నిబద్ధతతో పాటు లోతైన విధేయత కలిగి ఉంటారు. ఇది వారిని నమ్మకమైన, స్థిరమైన వర్కర్స్‌గా తయారు చేస్తుంది. అంతర్ముఖంగా ఉంటూ రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు.