కేంద్ర ప్రభుత్వంపై దీదీ ఫైర్.. స్వేచ్ఛ లేకుండా చేస్తారా..?

by Shamantha N |   ( Updated:2021-07-28 06:46:35.0  )
కేంద్ర ప్రభుత్వంపై దీదీ ఫైర్.. స్వేచ్ఛ లేకుండా చేస్తారా..?
X

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ప్రస్తుత పరిస్థితులు ఎమర్జెన్సీ కంటే తీవ్రంగా ఉన్నాయని అన్నారు. “పెగాసస్ హైలోడెడ్ వైరస్. నా ఫోన్‌ హ్యాక్ అయింది. ఇప్పటికే అభిషేక్ బెనర్జీ ఫోన్‌ను హ్యాక్ చేశారు. ప్రశాంత్ కిశోర్ ఫోన్ కూడా. ఒక్క ఫోన్‌ను ట్యాప్ చేస్తే చాలా ఫోన్లను హ్యాక్ చేయవచ్చు. జీవితం, ఆస్తి, భద్రత అంశాలు దీని చుట్టూ ముడిపడి ఉన్నాయి ” అని అన్నారు. “మన భద్రతకు ముప్పు ఉన్నది. ఎవ్వరికీ స్వేచ్ఛ లేదు” అని తెలిపారు. స్పైవేర్ పెగాసస్‌ అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించాలని అన్నారు. “మాకు సుప్రీంకోర్టుపై విశ్వాసమున్నది. పెగాసస్‌పై దర్యాప్తు జరపాలి. కానీ, వారికి వాస్తవాల పట్ల పట్టింపు లేదు. ఏదైనా విషయాన్ని లేవనెత్తితే వారు పట్టించుకోరు. కానీ, దానికీ ఓ పరిమితి ఉంటుంది కదా” అని తెలిపారు.

రాజకీయ తుఫాన్‌ను మీరు ఆపలేరు..

బీజేపీతో పోరాడటానికి విపక్షాలన్నీ ఏకమవ్వాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఐక్యమై పోరాడితే ఆ రాజకీయ తుఫాన్‌ను కేంద్రం ఆపలేదని చెప్పారు. విపక్షాలు సీరియస్‌గా ట్రై చేస్తే ఆరు నెలల్లో ఫలితాలు కనిపిస్తాయని, ఆ కూటమికి నేత అనేది అప్పటి పరిస్థితులను బట్టి ఖరారవుతుందని అన్నారు. వేరే వాళ్లు లీడ్ చేసినా తనకేమీ అభ్యంతరం లేదని వివరించారు. యూపీలో బీజేపీని ఓడించాలంటే అక్కడి ప్రతిపక్ష పార్టీలు నిర్ణయం తీసుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed