‘నా పెళ్లి.. కరోనా ఆపింది’

by Anukaran |   ( Updated:2020-07-24 02:14:42.0  )
‘నా పెళ్లి.. కరోనా ఆపింది’
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ప్రతి రంగంపై దీని ప్రభావం పడుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది పెళ్లి కార్యక్రమాలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఏపీలో కూడా కరోనా కారణంగా ఓ పెళ్లి కార్యక్రమం నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం పాతపట్నం మండలం చంగుడిలో ఓ వివాహ కార్యక్రమం నిర్వహించేందుకు రెండు కుటుంబాలు సిద్ధమయ్యారు. అయితే.. వరుడికి కరోనా సోకింది. టెస్టుల్లో అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ పెళ్లి కార్యక్రమం వాయిదా పడింది. కరోనా పాజిటివ్ గా వచ్చిన ఆ పెళ్లి కుమారుడిని 14 రోజులపాటు హోం క్వారంటైన్ కు తరలించారు. దీంతో పెళ్లి కార్యక్రమం నిలిచిపోయింది.

Advertisement

Next Story

Most Viewed