- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాత్రికేయుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తాం
దిశ, అదిలాబాద్: పాత్రికేయుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం పాత్రికేయులకు మాస్కులు శానిటైజర్ లు అందజేశారు. అలాగే జోగు ఫౌండేషన్ ద్వారా 2 లక్షల ఆరోగ్య భీమా పాలసీని అదిలాబాద్ నియోజకవర్గంతో పాటు తాంసి, భీంపూర్ మండలం చెందిన 120 మంది పాత్రికేయులకు వర్తింప చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో విలేకరులు ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారని వారి సేవలను గుర్తించి ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య బీమా అందిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా 4,500 ఆస్పత్రుల్లో బీమా వర్తిస్తుంది అని వివరించారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నగేష్, కౌన్సిలర్లు, జర్నలిస్టు యూనియన్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .