- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంచి వ్యూహాలతో విజయాలు సాధిస్తాం -రికీ పాంటింగ్
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ సీజన్ మారినా చాంపియన్ మారలేదు. ఓటమితో మొదలు పెట్టిన ముంబయి జట్టు సీజన్ ఆసాంతం పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మంగళవారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ ఫైనల్స్ లో ముంబై విజయఢంకా మోగించింది. ఓటమి అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ… ఈ సీజన్‌లో ముంబయి జట్టు మమ్మల్ని నాలుగు సార్లు ఓడించింది. అది ఒక మంచి జట్టు. ఢిల్లీ కూడా యువకులతో నిండిన జట్టు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ యువకుడైనా తనను తాను మలుచుకుంటున్నాడు. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరినప్పుడు కొంచెం భయపడ్డాను. కానీ ఇక్కడ మంచి ఏర్పాట్లు చేశారు. రాబోయే సీజన్‌లో మరింత మంచి వ్యూహాలతో విజయాలు సాధిస్తాము.
Next Story