మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.. మంత్రి సబితా

by Shyam |   ( Updated:2021-08-31 08:06:34.0  )
ranjithn-reddy
X

దిశ వికారాబాద్: పుల్‌మామిడివాసి శ్రీనివాస్ కుమారులను చదివిస్తామని, వారి కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇప్పిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం ఉపొంగుతున్న వాగులో కొట్టుకొని పోయి మృతి చేందిన పుల్‌మామిడి వాసి చాకలి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మోమిన్‌పేట మండలం ఎన్కతల గ్రామానికి చెందిన వెంకటయ్య చేవెళ్ల పరిధిలో వాగులో పడి మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ప్రజా ప్రతినిధులు, అనంతరం మోమిన్‌పేటలో నవ వధువు ప్రవళిక కుటుంబాన్ని పరామర్శించారు.

అలాగే రావులపల్లిలో నవాజ్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంఘటన పై మంత్రి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తిమ్మపూర్ సంఘటనలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందగా నవాజ్ రెడ్డి అక్క కొడుకు ఆచూకి ఇంకా లభ్యం కాక పోవడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఎస్పీ నారాయణకు మంత్రి సూంచారు.అనంతరం ప్రతి బాధిత కుటుంబానికి ఎంపీ రంజిత్ రెడ్డి రూ.95 వేలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్, యాదయ్య, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, నవాబ్‌పేట్,మోమిన్‌పేట, మర్పల్లి మండలాల, సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed