- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం !
దిశ, తెలంగాణ బ్యూరో: 17శాతం తేమ ఉండాలని కేంద్రం నిబంధన ఉన్నా.. మిల్లర్లు 23నుంచి 26శాతం వరకు తేమ ఉన్న సన్నరకపు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని పౌర సరఫరాల సంస్ధ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సన్న వరి ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1880 కాగా మిల్లర్లు క్వింటాల్‌కు రూ.82అధికంగా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతాంగం ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ధాన్యం దిగుబడికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు.
ఇప్పటివరకు 3,074 కేంద్రాల ద్వారా 80వేల మంది రైతుల నుంచి 5లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మిర్యాలగూడ లో ప్రత్యేక మైన పరిస్దితులు ఉన్నాయని, ఇక్కడ పెద్ద ఎత్తున రైస్ మిల్లులు ఉండటంతో పక్క జిల్లాలైన సూర్యాపేట, యాదాద్రి , ఖమ్మం , జనగాం, జిల్లాల నుంచి రైతులు మిర్యాలగూడకు వచ్చి సన్న ధాన్యం అమ్ముకుంటున్నారని తెలిపారు. పౌర సరఫరాల సంస్ధ నల్గొండ జిల్లాలో 177 కొనుగోలు కేంద్రాలు, సూర్యాపేటలో 302 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు.