- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ కప్ గెలుపులో ఐపీఎల్ పాత్ర కీలకం..
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ జట్టు తొలి సారిగా వన్డే వరల్డ్ కప్ గెలవడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కీలక పాత్ర పోషించిందని.. క్యాష్ రిచ్ లీగ్ వల్లే మేము ప్రయోజనం పొందామని కెప్టెన్ ఇయాన్ మోర్గన్ అన్నాడు. ఐపీఎల్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘వరల్డ్ కప్ గెలుపులో ఐపీఎల్ పాత్ర చాలా ఉన్నది. అందుకు మేము కృతజ్ఞతలు చెబుతున్నాము. మా జట్టు అభివృద్దిలో ఆ లీగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది. మరోవైపు రాబోయే రెండేళ్లలో రెండు టీ20 వరల్డ్ కప్‌లు ఉన్నాయి. కాబట్టి ఐపీఎల్‌లో ఆడటం వల్ల మేం మరింతగా ప్రయోజనం పొందుతాము. ఈ లీగ్ నుంచి మేము చాలా ఆత్మవిశ్వాసాన్ని పొందుతున్నాము’ అని కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు.రేపటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మోర్గన్ జట్టు ఐపీఎల్ అనుభవంతో తప్పకుండా అడ్డుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.